APSRTC Jobs:


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు పరిధిలో... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 309 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఐటీఐలలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.


అర్హులైన అభ్యర్థులకు నవంబరు 16న కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు వివరాల కోసం 08518-257025, 7382869399, 7382873146 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి. 


వివరాలు..

* అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 309 

జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 49, నంద్యాల- 50, అనంతపురం- 52, శ్రీసత్యసాయి- 40, కడప- 67, అన్నమయ్య- 51.

ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.

అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


దరఖాస్తు విధానం: నోటిఫికేషన్‌తోపాటు ఇచ్చిన రెజ్యూమ్ ఫార్మాట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దాన్ని నింపి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీలను జతచేసి నిర్ణీత తేదీ రోజు ధ్రువపత్రాల పరిశీలను హాజరుకావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఆధార్ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది.  పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్న సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే, ఐటీఐ కళాశాలలో సంప్రదించవచ్చు. ఆధార్ కార్డులో ఉన్నవివరాలు, పదోతరగతి సర్టిఫికేట్‌లో వివరాలు సరిపోలాలి. 

ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.


అవసరమయ్యే సర్టిఫికేట్లు..


➥ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ప్రొఫైల్


➥ అప్రెంటిస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు


➥ పదోతరగతి మార్కుల జాబితా


➥ ఐటీఐ మార్కుల మెమో


➥ ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ తప్పనిసరి


➥ వికలాంగులైతే ధ్రువీకరణ పత్రం


➥ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగాలకు చెందినవారైతే సర్టిఫికేట్ ఉండాలి


➥ ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు


➥ ఆధార్ కార్డు


దరఖాస్తు సమర్పణ, సర్టిఫికేట్ల పరిశీలన వేదిక:
Principal, 
Zonal Staff Training College,
APSRTC,
Bellary Chowrastha, Kurnool (PO)& Dt.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.11.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023.


➥ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 16.11.2023.


Notification & Application


Apprenceship Registration


Website


ALSO READ:


ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801  పోస్టులు, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...