ఏపీ లెజిస్లేచర్ సర్వీసులో తెలుగు రిపోర్టర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పేపర్-2 (కన్వెన్షనల్ టైప్-డిక్టేషన్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ & ట్రాన్‌స్క్రిప్షన్ ఇన్ లాంగ్‌హ్యాండ్) పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 5న తెలుగు రిపోర్టర్స్ పేపర్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే నవంబరు 16న పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. విజయవాడలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. 



అదేవిధంగా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 21, నవంబరు 7న నిర్వహించనున్న జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పేపర్ అన్ని పోస్టులకు కామన్‌గా ఉంటుందని కమిషన్ పేర్కొంది. ఒక్కో నోటిఫికేషన్‌కు ఒక్కో పేపర్ కాకుండా, అన్ని నోటిఫికేష్లకు ఒకే జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పరీక్ష పేపర్ ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షలో వచ్చే మార్కులను అన్ని పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. వీటిలో నాన్-గెజిటెడ్ పోస్టులు (నోటిఫికేషన్ నెం.20/2021), డీఏవో పోస్టులు (నోటిఫికేషన్ నెం.19/2021), తెలుగు రిపోర్టర్లు (నోటిఫికేషన్ నెం.13/2021), డీపీఆర్వో (నోటిఫికేషన్ నెం.17/2021), ఎక్స్-టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (నోటిఫికేషన్ నెం.21/2021) పోస్టులు ఉన్నాయి.




:: Also Read ::


APPSC: 'గ్రూప్-1' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.  గ్రూప్-1 పరిధిలో మొత్తం 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ  నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


 


APPSC: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!

ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!

ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...