APPSC Recruitment Notifications: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ 6 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 కింద 18 పోస్టులు ఉన్నాయి. ఇక టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్- 07 పోస్టులు, మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్-04 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-01 పోస్టు, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్-02 పోస్టులు, భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్-01 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంత్ కింద 19 పోస్టులు కేటాయిస్తూ ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది.


దరఖాస్తు వివరాలు..


➥ కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.


➥ టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.


➥ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.


➥ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్‌లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.


➥ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్స్ జెండర్, సీనియర్ సిటిజన్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్  1 నుంచి ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.


➥ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుల భర్తీకి ఏప్రిల్  1 నుంచి ఏప్రిల్ 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.



ALSO READ:


ఫిబ్రవరి 12 నుంచి డీఎస్సీ దరఖాస్తులు..


AP DSC Notifcation 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ డీఎస్సీ 2024 (AP DSC) నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదలచేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఫిబ్రవరి 21లోగా నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు వెలువడనున్నాయి.


ఏపీ డీఎస్సీ-2024 (టీఆర్టీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల్లోని 6100  పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు. 
డీఎస్సీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..