AEI Notification: ఏపీలో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, ప్రారంభ జీతం రూ.57 వేలు

ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (AEI) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Continues below advertisement

APPSC Assistant Electrical Inspector Recruitment: ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీస్‌లో అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (AEI) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మార్చి 21  నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

Continues below advertisement

వివరాలు..

* అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ (Assistant Electrical Inspector)

విభాగం: ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీస్‌.

ఖాళీల సంఖ్య: 03

పోస్టుల కేటాయింపు: ఓసీ-01, బీసీ(ఎ)-02.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్/ఎన్‌సీసీ అభ్యర్థులకు వయసు ఆధారంగా 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వరకు వయోసడలింపు వర్తిస్తుంది.  

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్థాయిలో)-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-150 ప్రశ్నలు-300 మార్కులు-150 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

జీత భత్యాలు: నెలకు రూ.57,100 - రూ.1,47,760 ఇస్తారు. 

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటుూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2024. (11:59)

➥ రాతపరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

Notifiction

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola