NBK109 First Glimpse Out: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎన్‌బీకే 109'(NBK 109) అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్‌పైకి తీసుకువచ్చారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సినిమా రూపొందుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, 'వాల్తేరు వీరయ్య' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తెరక్కించిన బాబీ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్‌ అందించారు.


అదుర్స్ అనిపిస్తున్న ఫస్ట్ గ్లింప్స్


శివరాత్రి సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్‌ చేసి నందమూరి ఫ్యాన్స్‌కి పండగ ట్రీట్‌ ఇచ్చారు. ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌లో బాలయ్య లుక్‌ నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. డార్క్‌ థీమ్‌తో మలిచిన ఈ గ్లింప్స్‌లో బాలయ్య మార్క్‌కు ఏమాత్రం తగ్గని పవర్ఫుల్‌ డైలాగ్స్‌ ఉన్నాయి. చికట్లో మంటలు చెలరేగుతుండగా.. కారులో నుంచి దిగుతాడు బాలయ్య. అగ్నిలావాలా పొంగుతున్న మంటల్లో బాలయ్య ఎంట్రీ అదుర్స్‌ అనిపిస్తుంది. ఇందులో విలన్ – ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? అనే డైలాగ్‌ రాగా.. సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్.. హంటింగ్ అంటారు అని బాలయ్య చెప్పిన పవర్ఫుల్  డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఆ తర్వాత బాలయ్య స్టైలిష్‌గా మందు సీసా ఎత్తి తాకడం , విలన్లపై బ్రహ్మరాక్షసుడిగా విరుచుకుపడిన బాలయ్య లుక్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అని చెప్పాలి. ఇక ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో మరింత యంగ్ గా కనపడ్డారు.



మరింత యంగ్‌గా బాలయ్య


దీంతో ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. బాలయ్య లుక్‌ అయితే అదిరిపోయిందంటున్నారు. కాగా 'NBK 109' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా, ఒక పోలీసాఫీసర్ పాత్రలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్టు ఇప్పటికే ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చింది. అలానే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.


అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియలేదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకూ నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించకపోవడం మరింత ఆసక్తిని పెంచుతుంది. నందమూరి బాలకృష్ణ గత మూడేళ్ళుగా తన కెరీర్ లోనే మునుపెన్నడూ లేనంత ఫార్మ్ లో కొనసాగుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. సరికొత్త కథాంశంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేస్తున్న NBK 109 మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, బాలయ్య సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అవుతుందని ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌పై అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.