ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నవంబరు 3 నుంచి 7 వరకు నిర్వహించనున్న రాతపరీక్షల హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పలు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందుకుగాను అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ పొందవచ్చు. అన్ని పోస్టుల భర్తీకీ పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) పరీక్షను కామన్‌గా నిర్వహిస్తారు. నవంబరు 7న ఉదయం పేపర్-1 పరీక్ష ఉంటుంది.
పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్షల షెడ్యూలు ఇదే..
➥ నోటిఫికేషన్ నెం.19/2021
గెజిటెడ్ పోస్టులు:
1) డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) గ్రేడ్-1(వర్క్స్)
విభాగం: ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్.
పరీక్ష తేది: 03.11.2022 (ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3 పరీక్షలు)
➥ నోటిఫికేషన్ నెం.20/2021
నాన్ గెజిటెడ్ పోస్టులు:
2) అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
విభాగం: ఏపీ ఇన్‌ఫర్మేషన్ సబార్టినేట్ సర్వీస్.
పరీక్ష తేది: 04.11.2022 (ఉదయం పేపర్-2 పరీక్ష)
3) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
విభాగం: ఏపీ ఎకనామిక్స్ & స్టాటిస్టికల్ సబ్ సర్వీస్.
పరీక్ష తేది: 04.11.2022 (ఉదయం పేపర్-2 పరీక్ష)
4) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్.
పరీక్ష తేది: 05.11.2022 (ఉదయం పేపర్-2 పరీక్ష)
➥ నోటిఫికేషన్ నెం.17/2021
5) డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
విభాగం: ఏపీ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్.
పరీక్ష తేది: 06.11.2022 (ఉదయం పేపర్-2, మధ్యాహ్నం పేపర్-3)
➥ నోటిఫికేషన్ నెం.21/2021
6) ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 (సూపర్‌వైజర్)
విభాగం: ఏపీ ఉమెన్ డెవలప్‌మెంట్, ఛైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్.
పరీక్ష తేది: 07.11.2022 (మధ్యాహ్నం పేపర్-2)
➥ నోటిఫికేషన్ నెం.13/2021
7) తెలుగు రిపోర్టర్స్
విభాగం: ఏపీ లెజిస్లేచర్ సర్వీస్.
పరీక్ష తేది: 16.11.2022 (మధ్యాహ్నం పేపర్-2)
:: Also Read ::
వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు - ఇలా చెక్ చేసుకోండి!
ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 18 నుంచి 21 వరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీలను ఏపీపీఎస్సీ అక్టోబరు 27న విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల సమాధాన పత్రాలు (రెస్పాన్స్ షీట్లు) కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లలోని సమాధానాలు సరిచూసుకోవచ్చు. దీనిద్వారా మార్కులపై ఓ అంచనాకు రావచ్చు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
APPSC CAS Application: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..