APPSC Group 2 Prelims Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) ఫలితాలు ఏప్రిల్ 10న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:100 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులకు ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. ప్రిలిమ్స్ ఫలితాల ద్వారా మొత్తం 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించగా.. 2,557 మంది అభ్యర్థుల్ని వివిధ కారణాలతో తిరస్కరించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలతోపాటు పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
Provisionally qualified candidates list for mains examination
Rejections list
Final Key: General Studies & Mental ability
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. జూన్ లేదా జులైలో మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి తర్వాత దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
గ్రూప్-2 మెయిన్ పరీక్ష విధానం..
ఆంధ్రప్రదేశ్‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి జవనరి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
ALSO READ:
యూపీఎస్సీ సీఎంఎస్-2024 నోటిఫికేషన్ విడుదల, వివిధ విభాగాల్లో 827 పోస్టుల భర్తీ
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..