కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 10న విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటల వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష జులై 14న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో నిర్వహించనున్నారు.
వివరాలు..
* యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024
ఖాళీల సంఖ్య: 827 పోస్టులు
1) మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్: 163 పోస్టులు
విభాగం: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్
2) అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్: 450 పోస్టులు
విభాగం: రైల్వే.
3) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 14 పోస్టులు
విభాగం: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.
4) జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2): 200 పోస్టులు
విభాగం: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.
విద్యార్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలకు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రుసుం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం..
✪ పార్ట్-1లో భాగంగా మొత్తం 500 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరకు 250 మార్కులు. ఒక్కో పేపరులో 120 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.
✪ పేపర్-1లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ గురించి, పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ & అబ్‌స్ట్రేట్రిక్స్, ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
✪ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
✪ పార్ట్-2లో భాగంగా 100 మార్కులకు పర్సనాలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 10.04.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2024.
➥ సీఎంఎస్ పరీక్ష తేది: 14.07.2024.
ALSO READ:
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 158 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
DTU Recruitment: ఢిల్లీలోని షహబాద్ దౌలత్‌పూర్‌లోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిజైన్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఎకనామిక్స్ (యూఎస్‌ఎంఈ), మేనేజ్‌మెంట్ (యూఎస్‌ఎంఈ), బయో-టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, ప్రెజెంటేషన్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..