ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో ఈవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ అక్టోబరు 27న రాత్రి విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. మొత్తం 60 ఈవో పోస్టుల భర్తీకి జులై 24న స్క్రీనింగ్‌టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 52,915 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1278 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచారు. మెయిన్స్ పరీక్షతేదీని త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. 


మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాతోపాటు కటాఫ్ మార్కుల వివరాలు, పరీక్షలో పలు కారణాలతో అనర్హతకు గురైన అభ్యర్థుల వివరాలను కమిషన్ వెల్లడించింది. వీటితోపాటు స్క్రీనింగ్ పరీక్ష ఫైనల్ కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం విషయనిపుణులతో పర్యవేక్షణ అనంతరం ఫైనల్ కీని విడుదల చేసింది.


ఫలితాలు, కటాఫ్ మార్కులు, అనర్హుల వివరాలు ఇలా:


Results of Qualified Candidates for Mains       ||       Final Key 


Cut off marks statement


List of Invalidated candidates



ఏపీలోని దేవాదాయశాఖలో 60 ఈవో పోస్టుల భర్తీకి జులై 24న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 52,915 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని జులై 26న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం, వచ్చిన అభ్యంతరాలపై విషయనిపుణులతో పరిశీలన జరిపి తాజాగా ఫలితాలతోపాటు ఫైనల్‌ కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఫలితాల్లో మొత్తం 1278 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు.







 


:: Also Read ::


వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు 
ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 18 నుంచి 21 వరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీలను ఏపీపీఎస్సీ అక్టోబరు 27న విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల సమాధాన పత్రాలు (రెస్పాన్స్ షీట్లు) కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లలోని సమాధానాలు సరిచూసుకోవచ్చు. దీనిద్వారా మార్కులపై ఓ అంచనాకు రావచ్చు.
 
28 నుంచి అభ్యంతరాలకు అవకాశం...
ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీలపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు. అక్టోబరు 28 నుంచి 30 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఏపీపీఎస్సీ ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆన్‌లైన్ లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు అభ్యంతరాలు తెలపాలి. వాట్సాప్ ద్వారా, ఎస్‌ఎంఎస్ ద్వారా, ఫోన్ ద్వారా, నేరుగా అభ్యంతరాల నమోదు ఉండదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలి.


ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..