ఏపీలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 18 నుంచి 21 వరకు నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీలను ఏపీపీఎస్సీ అక్టోబరు 27న విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలతోపాటు అభ్యర్థుల సమాధాన పత్రాలు (రెస్పాన్స్ షీట్లు) కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీ ద్వారా అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లలోని సమాధానాలు సరిచూసుకోవచ్చు. దీనిద్వారా మార్కులపై ఓ అంచనాకు రావచ్చు.
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..
వివిధ పరీక్షల ప్రాథమిక 'కీ' కోసం క్లిక్ చేయండి..
28 నుంచి అభ్యంతరాలకు అవకాశం...
ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీలపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు. అక్టోబరు 28 నుంచి 30 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఏపీపీఎస్సీ ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆన్‌లైన్ లింక్ ద్వారా మాత్రమే అభ్యర్థులు అభ్యంతరాలు తెలపాలి. వాట్సాప్ ద్వారా, ఎస్‌ఎంఎస్ ద్వారా, ఫోన్ ద్వారా, నేరుగా అభ్యంతరాల నమోదు ఉండదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించాలి.
ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలు ఇవే..
గెజిటెడ్ పోస్టులు (నోటిఫికేషన్ నెం.19/2021):
- ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏపీ ఫిషరీస్ సర్వీస్)
- సెరికల్చర్ ఆఫీసర్ (ఏపీ సెరికల్చర్ సర్వీస్)
- అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏపీ అగ్రికల్చర్ సర్వీస్)
- టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ పోలీస్ సర్వీస్)
- అసిస్టెంట్ కమిషనర్-ఎండోమెంట్ (ఏపీ ఎండోమెంట్ సర్వీస్)
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ హార్టికల్చర్ సర్వీస్)
నోటిఫికేషన్ నెం.12/2021:
- హార్టికల్చర్ ఆఫీసర్ (ఏపీ హార్టికల్చర్ సర్వీస్)
- అసిస్టెంట్ డైరెక్టర్(ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్)
నోటిఫికేషన్ నెం.20/2021:
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్.
:: Read Also ::
APPSC CAS Application: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC AEE Application: ఏఈఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 14లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..