APPSC DyEO Answer Key: ఏపీపీఎస్సీ డీవైఈవో రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం

DyEO Answer Key: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి మే 25న నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఏపీపీఎస్సీ మే 28న విడుదల చేసింది.

Continues below advertisement

APPSC DyEO Answer Key: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఉద్యోగాల భర్తీకి మే 25న నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (APPSC) మే 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్ కీపై సందేహాలుంటే అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 29 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ అభ్యంతరాలు సమర్పించవచ్చు.

Continues below advertisement

ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఉద్యోగాల భర్తీకి మే 25న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు పకడ్భందీగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 21,991 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 18,037 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 82.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో  మెయిన్ (Main) పరీక్ష నిర్వహిస్తారు.

General Studies and Mental Ability - Answer Key

Download Candidates Response Sheet

ఆంధ్రప్రదేశ్‌లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DEO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతేడాది డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి  జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మే 18న విడుదల చేసింది. మే 25న పరీక్ష నిర్వహించింది. 

పరీక్ష విధానం..

➥ స్క్రీనింగ్ పరీక్ష: మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

➥ మెయిన్ పరీక్ష: మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: ఎడ్యుకేషన్-1కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3: ఎడ్యుకేషన్-2కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.

 కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.

పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola