ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఉద్యోగాల భర్తీకి నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. పలితాలతోపాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
మొత్తం 9 అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులకు గాను 1:3 నిష్పత్తిలో మొత్తం 27 మంది అభ్యర్థులను వాకింగ్ టెస్ట్, మెడికల్ టెస్టులకు అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపికచేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. వీటి తేదీలను కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది.
అసిస్టెంట్ కన్జర్వేటర్ తుది కీలు ఇలా..
ఫలితాల వివరాలు ఇలా..
సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే చిరునామా:
O/o A.P.P.S.C., New
HODs Building, 2nd Floor, M.G. Road,
Opp. Indira Gandhi Municipal stadium, Vijayawada,
Andhra Pradesh-520010
ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో 9 అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 నుంచి మే వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు నవంబరు 9 నుంచి 11 వరకు నియామక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని నవంబరు 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు నవంబరు 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించింది. తాజాగా ఫలితాలతోపాటు, తుది ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
Also Read:
DAO HallTickets: డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
త్వరలో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ: మంత్రి హరీష్‌రావు
రాష్ట్రంలో త్వరలోనే 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను మంత్రి హరీష్‌రావు తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..