ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 14లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పోస్టుల వివరాలు..


* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) 


ఖాళీల సంఖ్య: 23 


జోన్లవారీగా పోస్టుల కేటాయింపు: జోన్ 1-09, జోన్ 2-05, జోన్ 3-04, జోన్ 4-05.


విభాగాల వారీగా ఖాళీలు: 


1) ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ & శానిటేషన్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 13 పోస్టులు 


2) రోడ్స్ & బిల్డింగ్స్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 03 పోస్టులు 


3) ఏపీ వాటర్ రిసోర్సెస్ సర్వీస్ (సివిల్ & మెకానికల్): 05 


4) ఏపీ పంచాయత్‌రాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ సర్వీస్ (సివిల్): 02 


అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష, మెడికల్ ఫిట్‌‌నెస్ ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


రాతపరీక్ష విధానం:


✒ మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులు, పేపర్-2: 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.


✒ పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టులకు (సివిల్ & మెకానికల్) సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-3లో (సివిల్/మెకానికల్) సబ్జెక్టులకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.


✒ ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు. 


పరీక్షలో అర్హత మార్కులు: జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. 


జీతం: నెలకు రూ.57,100 – రూ.1,47,760



ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.10.2022.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.11.2022.


Notification


Website


:: ALSO READ ::


✦ AP High Court Jobs: హైకోర్టులో 36 టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు, అర్హతలివే!


✦ AP High Court Jobs: హైకోర్టులో డ్రైవర్ పోస్టులు, వివరాలు ఇలా!


✦ AP High Court Jobs: హైకోర్టులో ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే


✦ AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ ఓవర్‌సీర్ పోస్టులు, అర్హతలివే!


✦ AP High Court Jobs: హైకోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!


✦ AP High Court Jobs: హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, అర్హతలివే!


✦ AP High Court Jobs: హైకోర్టులో 27 అసిస్టెంట్, ఎగ్జామినర్ ఉద్యోగాలు


✦ AP High Court Jobs: ఏపీ హైకోర్టులో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!


✦ AP High Court Jobs: హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...