టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1 డేంజరస్‌గా మారుతుంది. ఈ గ్రూపు నుంచి సంచలనాలు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా బుధవారం మ్యాచ్‌ల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాడు. మొదటి వన్డేలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ ఐదు పరుగులతో విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఈ మ్యాచ్ ఫలితాన్ని ప్రకటించారు.


ఇక ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు తలో విజయం సాధించాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో కూడా ఒక పాయింట్ పడింది.


ఓవరాల్‌గా గ్రూప్ చూసుకుంటే... న్యూజిలాండ్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలు రెండేసి పాయింట్లతో రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆఖరి స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కూడా ఒక పాయింట్ ఉంది. దీంతో ఈ గ్రూప్ డేంజరస్‌గా మారనుంది. సెమీస్ బెర్త్‌లు చివరి వరకు ఖరారు కావడం కష్టమే.


గ్రూప్-1లో మిగతా మ్యాచ్‌ల్లో కొన్ని శుక్రవారం జరగనున్నాయి. ఆప్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడనున్నాయి. దీని తర్వాత అదే మైదానంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం కానుంది. అనంతరం శనివారం న్యూజిలాండ్, శ్రీలంకలు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడనున్నాయి.