APPSC Group 1 Results | అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 4 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. కమిషన్ 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. జూన్ 23వ తేదీ నుంచి 30 వరకు ఏపీ గ్రూప్-1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెయిన్స్ నిర్వహించిన నెల రోజులకే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు మంగళవారం నాడు విడుదల చేసింది. గ్రూప్ 1 రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ గ్రూప్ 1 ఫలితాలు డైరెక్ట్ లింక్
ఏపీలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496 మంది మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. మే నెలలో పరీక్షలు నిర్వహించి, వాల్యుయేషన్ తరువాత ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేశారు. జూన్ 10న రాత్రి మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
గ్రూప్ 1 కేసు విచారణ
వైసీపీ హయాంలో జరిగిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కుంభకోణం కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. గ్రూప్ 1 అక్రమాల కేసులో పోలీసులు పేపర్ వాల్యూవేషన్లో పాల్గొన్న 60 మందిని విచారించారు. ఈ క్రమంలో క్యామ్‌సైన్ డైరెక్టర్ ధాత్రి మధును హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్లో భారీ అక్రమాలకు క్యామ్‌సైన్ తెరలేపిందని దర్యాప్తులో గుర్తించారు. ఏ అర్హత లేనివారు, సబ్జెక్ట్ తెలియని వారు, గృహిణులతో పేపర్లు వాల్యుయేషన్ చేశారని గుర్తించారు. హాయ్‌ల్యాండ్ వేదికగా మాన్యువల్ వాల్యుయేషన్ జరగలేదని పోలీసులు తెలిపారు. కొందరు వ్యక్తులను తాత్కాలికంగా నియమించుకుని పేపర్లు కరెక్షన్ చేపించారని అభియోగాలున్నాయి.