APPSC Deputy Educational Officer Screening Test: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఉద్యోగాల భర్తీకి మే 25న నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు పకడ్భందీగా నిర్వహించారు.


ఈ పరీక్షలకు మొత్తం 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 21,991 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 18,037 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 82.02 శాతం ఉత్తీర్ణత నమోదైంది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో  మెయిన్ (Main) పరీక్ష నిర్వహిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.61,960 – రూ.1,51,370 జీతంగా చెల్లిస్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DEO) ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గతేడాది డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీజీ డిగ్రీతోపాటు, బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి  జనవరి 9 నుంచి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (DyEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మే 18న విడుదల చేసింది. మే 25న పరీక్ష నిర్వహించింది. 



వివరాలు..


* డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డీఈవో) పోస్టులు


ఖాళీల సంఖ్య: 38.


జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 07 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 08 పోస్టులు, జోన్-14: 11 పోస్టులు.


పరీక్ష విధానం..


➥ స్క్రీనింగ్ పరీక్ష: మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.


➥ మెయిన్ పరీక్ష: మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: ఎడ్యుకేషన్-1కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3: ఎడ్యుకేషన్-2కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.


 కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.


పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.


జీతం: రూ.61,960 – రూ.1,51,370. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..