APPSC Group 2: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ ప్రకారం ఇప్పటికే 892 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాగా, తాజాగా మరో 1,466 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లను కమిషన్ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యుడు సుధీర్‌తో కలిసి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ శశిధర్‌ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ నోటిఫికేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి ఖాళీల సంఖ్య, కేటగిరీల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతల వివరాలతో పూర్తిస్థాయి ప్రకటనలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Continues below advertisement

గ్రూప్‌-2లో 686 పోస్టులు 

తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో గ్రూప్‌-2 లో 686 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌-2కి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను నవంబరు 9న విడుదల చేస్తారు. విద్యార్హతలు, పోస్టుల వారీగా కేటాయింపు తదితర వివరాలు పూర్తి నోటిఫికేషన్‌లో వెల్లడిస్తారు. 

గ్రూప్-2 పరీక్షా విధానం  

స్క్రీనింగ్ పరీక్ష  

  • మొత్తం 150 మార్కులకు (ఆబ్జెక్టివ్ టైప్) పరీక్ష నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్ష  

  • మెయిన్స్ దశలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు మెయిన్స్ ఉంటుంది.

వయోపరిమితి  

  • వయోపరిమితికి జులై 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటారు. 
  • నాన్‌-యూనిఫామ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సాధారణ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోసడలింపులు వర్తిస్తాయి. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, దరఖాస్తుల కోసం APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ను క్రమం తప్పకుండా పరిశీలించాలని కమిషన్ కోరింది. ఏపీపీఎస్సీ నిర్వహించే ఏ ఉద్యోగానికైనా దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న తమ ఐడీని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.   Also Read: ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇవే!
Continues below advertisement