సివిల్ సర్వీసెస్-2023 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ జూన్ 12న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది వరకు హాజరయ్యారు. కటాఫ్ మార్కుల ఆధారంగా వారిలో 14,624 మంది మెయిన్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమ్స్ పరీక్షలో దాదాపు 600 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. 


యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 71,128 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సుమారు 45 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 200లకు కటాఫ్ మార్కులు 80 వరకు ఉండే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూపీఎస్సీ మాత్రం కటాఫ్ మార్కులను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. 


సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 15 నుంచి అయిదు రోజులపాటు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఫలితాలను వెల్లడిస్తారు. 


మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.  


Also Read:


ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్, వివరాలు ఇలా!
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2023 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. జేఈఈ (మెయిన్)-2023 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!
తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి తుది పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించనున్న ధ్రువపత్రాల పరిశీలన తేదీలను పోలీసు నియామక మండలి ఖరారుచేసింది. ఈ మేరకు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు జూన్ 9న అధికారిక ప్రకటన విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం కటాఫ్‌ మార్కులు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కటాఫ్‌ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్‌, ఇతర కేసుల వెరిఫికేషన్‌ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..