Government Medical Colleges under the Directorate of Medical Education, AP: ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిద్యా, వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ మెండికల్, డెంటల్ కాలేజీల్లో పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 997 సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ పోస్టులను భర్తీచేయనున్నారు. ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగాల్లో పీజీడిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆగస్టు 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైనవారికి నెలకు రూ.70,000 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా ఏడాదిపాటు పని చేయాల్సి ఉంటుంది.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 997. 


1) సీనియర్ రెసిడెంట్ (క్లినికల్): 425 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
➥ జనరల్ మెడిసిన్: 53  పోస్టులు
➥ జనరల్ సర్జరీ: 42  పోస్టులు
➥ అబ్‌స్టేట్రిక్స్ &గైనకాలజీ: 16  పోస్టులు
➥ అనస్తీషియా: 30  పోస్టులు
➥ పీడియాట్రిక్స్: 30  పోస్టులు
➥ ఆర్థోపెడిక్స్: 15  పోస్టులు
➥ ఆఫ్తాల్మాలజీ: 07  పోస్టులు
➥ ఈఎన్‌టీ: 06  పోస్టులు
➥ డెర్మటాలజీ: 03  పోస్టులు
➥ రెస్పిరేటరీ మెడిసిన్‌: 10  పోస్టులు
➥ సైకియాట్రి: 05 పోస్టులు
➥ రేడియో డయాగ్నోసిస్‌/ రేడియాలజీ: 35  పోస్టులు
➥ ఎమెర్జెన్సీ మెడిసిన్‌: 139  పోస్టులు
➥ డెంటిస్ట్రీ/డెంటల్ సర్జరీ: 01  పోస్టు
➥ రేడియోథెరపీ: 19 పోస్టులు
➥ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్: 04 పోస్టులు
➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 09 పోస్టులు
➥ న్యూక్లియర్ మెడిసిన్: 01 పోస్టు


2) సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్): 479 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
➥ అనాటమీ: 81  పోస్టులు
➥ ఫిజియాలజీ: 46  పోస్టులు
➥ బయో కెమిస్ట్రీ: 57  పోస్టులు
➥ ఫార్మకాలజీ: 71  పోస్టులు
➥ పాథాలజీ: 56  పోస్టులు
➥ మైక్రోబయాలజీ: 53  పోస్టులు
➥ ఫోరెన్సిక్ మెడిసిన్: 53  పోస్టులు
➥ కమ్యూనిటీ మెడిసిన్: 62  పోస్టులు


3) సూపర్ స్పెషాలిటీ: 93 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
➥  కార్డియాలజీ: 09  పోస్టులు
➥ ఎండోక్రైనాలజీ: 03  పోస్టులు
➥ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ: 04  పోస్టులు
➥ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ: 01  పోస్టు
➥ న్యూరాలజీ: 08  పోస్టులు
➥ కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ: 05  పోస్టులు
➥ ప్లాస్టిక్‌ సర్జరీ: 06  పోస్టులు
➥ పీడియాట్రిక్ సర్జరీ: 07  పోస్టులు
➥ యూరాలజీ: 08  పోస్టులు
➥ న్యూరో సర్జరీ: 09  పోస్టులు
➥ నెఫ్రాలజీ: 07  పోస్టులు
➥ సర్జికల్ అంకాలజీ: 13  పోస్టులు
➥ మెడికల్ అంకాలజీ: 12  పోస్టులు
➥ నియోనాటాలజీ: 01 పోస్టు


అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 44 సంవత్సరాలకు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: పీజీ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.


జీత భత్యాలు: నెలకు రూ.70,000 ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 19.08.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.08.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.08.2024.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..