సికింద్రాబాద్‌లోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న వారు నవంబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 జీతం ఉంటుంది.


వివరాలు..


* మెటీరియల్ అసిస్టెంట్:  419 పోస్టులు

రిజర్వేషన్లు:
జనరల్ - 171, ఈడబ్ల్యూఎస్ - 42, ఓబీసీ - 113, ఎస్సీ - 62, ఎస్టీ - 31. మొత్తం పోస్టుల్లో ఎక్స్-సర్వీస్‌మెన్లకు 41, స్పోర్ట్స్ పర్సన్స్-20, దివ్యాంగులకు 16 కేటాయించారు.


రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్- 10, వెస్ట్రన్-120, నార్తర్న్- 23, సదరన్- 32, సౌత్ వెస్ట్రన్- 23, సెంట్రల్ వెస్ట్- 185, సెంట్రల్ ఈస్ట్- 26.


అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజినీరింగ్/ డిప్లొమా(మెటీరియల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.


Also Read: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి



వయోపరిమితి:  
18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాగులకు 10 - 15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు; కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాలు; వితంతు/విడాకులు పొందిన మహిళలకు 35 సంవత్సరాలు/40 సంవత్సరాలు(ఎస్సీ/ఎస్టీ); స్పోర్ట్స్ పర్సన్స్- 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.


జీత భత్యాలు: రూ.29,200 నుంచి రూ.92,300.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు..


రాతపరీక్ష విధానం:
మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, న్యూమరిక్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-25 ప్రశ్నలు-25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. OMR షీట్ ద్వారా అభ్యర్థులు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.


Also Read: AP High Court Jobs: హైకోర్టులో 36 టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు, అర్హతలివే!



ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.10.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.11.2022. 


Notification


Online Application


Website


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..