Salar Jung Museum Recruitment Notification: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో గ్రూప్-ఎ, బి, సి పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో క్యూరేటర్, డిప్యూటీ క్యూరేటర్, అకౌంటెంట్, సీనియర్ ఫొటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మ్యూజియంలో ఉద్యోగాల భర్తీకి గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకు (3/2015, 6/2017, 8/2017, 2/2019, 04/2019) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తుల చేసుకోవాల్సిన అవసరంలేదు.


వివరాలు..


* గ్రూప్-ఎ, బి, సి పోస్టులు 


ఖాళీల సంఖ్య: 14.


1) క్యూరేటర్ (ఎడ్యుకేషన్) గ్రూప్-ఎ: 01 పోస్టు


అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యూజియోలజీ/ఫైన్ ఆర్ట్స్/ఆర్కియోలజీ/హిస్టరీ/ఎడ్యుకేషన్)తోపాటు సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. మ్యూజియోలజీలో పీజీ డిగ్రీ లేనివారు డిప్లొమా(మ్యూజియాలజీ) అర్హత కలిగి ఉండాలి. మోడర్న్ ఎగ్జిబిషన్ మెథడ్స్ & టెక్నిక్స్ నాలెడ్జ్ ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం రెండు ఎడ్యుకేషన్ వర్క్‌షాప్స్/క్యాంపులు/కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.67,700 - రూ.2,08,700.


2) క్యూరేటర్ (డిస్‌ప్లే) గ్రూప్-ఎ: 01 పోస్టు 


అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఆర్కిటెక్చర్/ఇంటీరియర్ డిజైన్/ఫైన్ ఆర్ట్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. డిప్లొమా (మ్యూజియాలజీ) అర్హత కలిగి ఉండాలి. మోడర్న్ ఎగ్జిబిషన్ మెథడ్స్ & టెక్నిక్స్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం రెండు ఎగ్జిబిషన్‌లు నిర్వహించిన అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.67,700 - రూ.2,08,700.


3) క్యూరేటర్ (కన్జర్వేషన్) గ్రూప్-ఎ: 01 పోస్టు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ/కన్జర్వేషన్). సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. పీజీ డిగ్రీ అర్హత లేనివారు డిగ్రీ/డిప్లొమా (మ్యూజియాలజీ). కన్జర్వేషన్ విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. 


వయోపరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.67,700 - రూ.2,08,700.


4) క్యూరేటర్ (మనుస్క్రిప్ట్స్) గ్రూప్-ఎ: 01 పోస్టు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (ఉర్దూ/ పర్షియన్/అరబిక్/హిస్టరీ)తోపాటు సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. డిప్లొమా (మ్యూజియాలజీ)తోపాటు మనుస్క్రిప్ట్‌లో రిసెర్చ్ పబ్లికేషన్ ఉండాలి. ఎపిగ్రఫీ, మనుస్క్రిప్ట్, కాలగ్రఫీతోపాటు ప్రాక్టికల్ అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. 


వయోపరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.67,700 - రూ.2,08,700.


5) డిప్యూటీ క్యూరేటర్ గ్రూప్-ఎ: 04 పోస్టులు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యూజియాలజీ/ఫైన్ ఆర్ట్స్/ఆర్కియోలజీ/హిస్టరీ)తోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. పీజీ డిగ్రీ అర్హతలేనివారు డిప్లొమా(మ్యూజియాలజీ) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. కలెక్షన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.56.100-రూ.1,77,500.


6) డిప్యూటీ క్యూరేటర్(ఎడ్యుకేషన్) గ్రూప్-ఎ: 01 పోస్టు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యూజియాలజీ/ఫైన్ ఆర్ట్స్/ఆర్కియోలజీ/హిస్టరీ/మాస్ కమ్యూనికేషన్)తోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. పీజీ డిగ్రీ అర్హతలేనివారు డిప్లొమా(మ్యూజియాలజీ) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. కలెక్షన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అనుభవం ఉండాలి. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషలపై పట్టు ఉండాలి. మ్యూజియమ్స్  లేదా ఎడ్యుకేషన్ టాపిక్స్ మీద కనీసం రెండు రిసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి. 


వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.56.100-రూ.1,77,500.


7) డిప్యూటీ క్యూరేటర్(కన్జర్వేషన్) గ్రూప్-ఎ: 01 పోస్టు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ/కన్జర్వేషన్)తోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. డిప్లొమా(మ్యూజియాలజీ) అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. 


వయోపరిమితి: 40 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.56.100-రూ.1,77,500.


8) అకౌంటెంట్ గ్రూప్-బి: 01 పోస్టు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (కామర్స్)తోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్, ట్యాలీ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. 


వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.35,400 - రూ.1,12,400.


9) సీనియర్ ఫొటోగ్రాఫర్ గ్రూప్-సి: 01 పోస్టు 


అర్హత: డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్)తోపాటు ఫొటోగ్రఫీ స్పెషలైజేషన్ ఉండాలి. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్, ట్యాలీ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. 


వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.35,400 - రూ.1,12,400.


10) గ్యాలరీ అసిస్టెంట్ గ్రూప్-సి: 01 పోస్టు 


అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యూజియాలజీ/ఆర్కియోలజీ/హిస్టరీ లేదా ఫైన్ ఆర్ట్స్). సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. పీజీ డిగ్రీ అర్హత లేనివారు పీజీ డిప్లొమా (మ్యూజియాలజీ) అర్హత ఉండాలి. 


వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.29,200 - రూ.92,300.


11) ఎలక్ట్రికల్ అటెండర్ గ్రూప్-సి (ఎంటీఎస్): 01 పోస్టు 


అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ సర్టిఫికేట్ (ఎలక్ట్రికల్ ట్రేడ్) కలిగి ఉండాలి. మ్యూజియంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.


జీతం: రూ.18,000-రూ.56,900


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director, Salar Jung Museum,
Hyderabad – 500 002.


దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 05.02.2024.


Notification & Application:


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...