PM Internship Scheme 2025: దేశ యువతకు మరోసారి గోల్డెన్ అవకాశం లభించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs) ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం 2025 (PM Internship Scheme 2025)కు నమోదుకు చివరి తేదీని 22 ఏప్రిల్ 2025కు పొడిగించింది. ముందుగా ఈ తేదీ మంగళవారంతోనే ముగిసింది. కానీ దీనిని మరోసారి పొడిగించింది కేంద్రం.
ఈ పథకం యువతకు వాస్తవ పని అనుభవాన్ని అందించడం ద్వారా వారు భవిష్యత్తుకు మెరుగైన రీతిలో సిద్ధం కావడానికి ఉద్దేశించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు pminternship.mca.gov.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
- అభ్యర్థి హైస్కూల్/హయ్యర్ సెకండరీ/ఐటీఐ సర్టిఫికెట్/పాలిటెక్నిక్ డిప్లొమా/BA, B.Sc, B.Com, BCA, BBA, B.Pharma వంటి డిగ్రీని పొంది ఉండాలి.
- 21 నుంచి 24 సంవత్సరాల వయస్సు ఉండాలి (దరఖాస్తు చివరి తేదీ ప్రకారం)
- అభ్యర్థి భారతీయ పౌరుడు కావాలి.
- అభ్యర్థి పూర్తి సమయ ఉద్యోగం లేదా చదువులో పాల్గొనకూడదు.
- ఆన్‌లైన్ లేదా దూర విద్య ద్వారా చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు.
పథకం ప్రత్యేకత ఏమిటి?ఇంటర్న్‌షిప్ కాలం 12 నెలలు ఉంటుంది. దీనిలో సగం సమయాన్ని అభ్యర్థులు తరగతి గదుల బయట అంటే ఆఫీస్‌లో గడపాల్సి ఉంటుంది. దీంతో ప్రాక్టికల్ అనుభవం వస్తుంది. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తుంటాారు. నైపుణ్య అభివృద్ధి లేదా ఇంటర్న్‌షిప్ పథకాలకు పూర్తిగా భిన్నమైనది. స్వతంత్రమైనది.
ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోండిఈ ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి నమోదు లేదా దరఖాస్తు ఫీజు అవసరం లేదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేయాలి
- మొదట అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.in కు వెళ్లండి.
- హోమ్ పేజీలో ఉన్న నమోదు లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ పూర్తి వివరాలను నమోదు చేసి నమోదును పూర్తి చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- అన్నీ తనిఖీ చేసిన తర్వాత ఫారమ్‌ను సమర్పించండి.
- చివరగా ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.