AP TET 2024 Answer Key: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1 వరకు నిర్వహించిన ఎస్‌జీటీ పేపర్ తుది ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ మార్చి 14న విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల సమాధానపత్రాలను (TET Response Sheets) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సబ్జె్క్టులవారీగా ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది.
SGT పరీక్ష ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..
ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాసేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 23 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 వరకు పేపర్-1 పరీక్షలు నిర్వహించారు. మార్చి 6 వరకు ఏపీ టెట్ 2024 పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు. అనంతరం ఏపీ టెట్ 2024 తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు. మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.