భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఐదవ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్  (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్  (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.


దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో ఏపీ నుంచి 509 మంది అభ్యర్థులు, తెలంగాణ నుంచి 289 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం ఎంపికైన అభ్యర్థులకు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియపరుస్తారు. 



ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఫలితాలు..


తెలంగాణ సర్కిల్ ఫలితాలు...


అక్టోబరు 6 లోగా వెరిఫై చేయించుకోవాలి...
ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 6లోగా సంబంధిత డివిజన్ హెడ్ ముందు తమ సర్టిఫికేట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించరు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.  


 


Also Read:


 SSC CGL Notification:  కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి,  గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే  'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022'  నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.  ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  మూడంచెల  (టైర్-1,టైర్-2,  టైర్-3)  పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 
నోటిఫికేషన్ , దరఖాస్తు వివరాల  కోసం  క్లిక్ చేయండి...


 


Also Read:


UPSC: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!
న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Also Read:


BHEL: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.దీని ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ/ డ్యుయల్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ పీజీ/ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్‌ 4వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...