AP Mega DSC 2025 Selected List: ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియలో మరో అడుగు పడింది. 16, 347 ఉద్యోగాలకు సంబంధించి వివిధ దశల్లో వడపోత చేపట్టిన అధికారులు తుది జాబితా విడుదల చేశారు. సోమవారం జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇప్పటికే పరీక్షలను క్లియర్ చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ పూర్తి అయిన వారితో ఈ జాబితా తయారు చేశారు. 19న వారికి మూకుమ్మడిగా నియామక పత్రాలు అందజేస్తారు. దీన్ని ఓ పండగలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.             

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16347 ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. వివిధ అడ్డంకులు దాటుకొని ఏప్రిల్‌  20న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం విడుదల చేసిన ఉద్యోగాలక ోసం 3, 36, 300 మంది అభ్యర్థులు 5, 77, 675 దరఖాస్తులు వచ్చాయి. వారందరికీ జూన్‌ 6 నుంచి నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రైమరీ కీ విడదల చేశారు. తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఫైనల్ ఆన్సర్ కీన ఆగస్టు 1న విడుదల చేశారు. తర్వాత అదే నెలలో ఫలితాలను కూడా విడుదల చేశారు.             

ఫలితాల్లో మెరిట్ ర్యాంకు సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు పిలిచారు. మొత్తం ఏడు విడతల్లో ప్రక్రియను పూర్తి చేశారు. అయినా సరే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారు. వివిధ సబ్జెక్టులకు వివిధ సమాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో భర్తీ కాలేదు. ఇలా దాదాపు ఆరు వందల పోస్టులు భర్తీ అవుతాయని అధికారులు భావించారు. కానీ ముందు పిలిచిన అభ్యర్థుల అర్హతలు సరిగా లేకపోవడంతో వారి తర్వాత మెరిట్ సాధించిన వారికి ఛాన్స్ ఇచ్చారు. ఇలా దాదాపు 16వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. మొత్తానికి మూడు వందలకుపైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.   

Continues below advertisement

ఈనెల 13వ తేదీ వరకు సర్టిఫికెట్స్ పరిశీలించిన అధికారులు శనివారంతో ప్రక్రియను పూర్తి చేశారు. అన్నీ పక్కాగా ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేశారు. అలా ఎంపికైన వారి జాబితాను ఇవాళ విడుదల చేశారు. ఎంపిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌, డీఈవో ఆఫీసుల్లో పెట్టారు. ఈ జాబితాలో ఉన్న అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ లెటర్స్ ఇస్తారు. 

సెలక్షన్ లిస్ట్‌ లింక్ ఇదే 

సెలక్షన్ లిస్ట్‌లో ఏం ఉంది 

ఏపీ డీఎస్సీకి సంబంధించిన సెలక్షన్ లిస్టులో  12 విభాగాలకు చెందిన ఉపాధ్యాయ పోస్టులకు చెందిన ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉంది. అందులో ఏ విభాగం నుంచి ఎవరెవరు ఎంపికయ్యారో పూర్తి వివరాలు ఇచ్చారు. 

ఈ నెల 19న పెద్ద పండగ  

మెగా డీఎస్సీలో ఎంపికైన వారికి పండగ వాతావరణంలో నియామకపత్రాలను ప్రభుత్వం అందజేయనుంది. దీని కోసం అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో 30వేల మంది పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ 

కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ఇస్తారు. వారం రోజుల పాటు ఈ ట్రైనింగ్ ఉంటుంది. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు చేపట్టావల్సిన చర్యలు గురించి ట్రైనింగ్‌లో వివరిస్తారు. అనంతరం దసరా సెలవుల తర్వాత వారంతా వారికి కేటాయించిన స్కూల్స్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.