AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. డీఎస్సీ స్కోర్ కార్డులలో టెట్ మార్కుల విషయంలో మార్పులు చేర్పులకు ఛాన్స్ ఇచ్చింది. అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు పెంచింది. ఈ వివరాలు తెలియజేస్తూ మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు రమ్మని చెప్పారనే వార్త రాష్ట్రంలో వైరల్ అయింది. దీనిపై అధికారిక ప్రకటన రాకుండానే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేశారు. దీన్ని ఆధారంగా కొన్ని మీడియాల్లో కూడా ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించాయి. ఇది అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఎవరికీ రాకపోవడంతో చాలా మందికి మెగా డీఎస్సీ హెల్ప్‌లైన్‌లకు ఫోన్‌లు చేసి ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పుడు చేసిన ప్రకటనతో ఫైనల్ జాబితా ఇంకా రెడీ కాలేదని స్పష్టమైంది. టెట్ మార్కులు కరెక్షన్ చేసుకోవడానికి మరోసారి అవకాశం కల్పించారు. ఒకవేళ టెట్ మార్కుల్లో మార్పులు చేర్పులు జరిగితే ఫైనల్ లిస్ట్‌లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. అందుకే గురువారం మధ్యాహ్నం వరకు టెట్ మార్కులు చేర్పులు చేసుకునేందుకు చివరి ఛాన్స్ కల్పించారు.
పాఠాశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో ఇలా ఉంది" మెగా డీఎస్సీ 2025 స్కోరు కార్డులు ఇదివరకే విడుదల చేయడం జరిగింది. అభ్యంతరాల స్వీకరించిన తర్వాత సవరించిన టెట్ మార్కులతో అనుసంధానించిన స్కోర్ కార్డులను https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు టెట్ మార్కుల్లో ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం, ఆఖరి అవకాశంగా భావించి 21.08.2025వ తేదీ మధ్యాహ్నం 12.00 లోపు సరిచేసుకోవాలి." అని ప్రకటనలో పేర్కన్నారు.