ఏపీలో జాబ్ క్యాలెండర్ కోసం ప్రక్రియ మళ్లీ మొదటికి చేరినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019లోనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఏపీపీఎస్సీలో అంతర్గత వివాదాలు, శాఖల ద్వారా ఖాళీల వివరాలు తెలియకపోవడం, ఆర్థికశాఖ నుంచి అనుమతులు రాకపోవడం వంటి అంశాల కారణంగా ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేకపోయినట్లు కమిషన్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే ఉన్న తరుణంలో ఖాళీల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఖాళీల భర్తీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న ఏపీపీఎస్సీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియపై సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీపీఎస్సీ ద్వారానే 42 ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. అది కూడా 267 కేటగిరీలకు చెందిన పోస్టులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మొత్తం కేటగిరీలను కేవలం ఏడుకు కుదించాలని భావిస్తున్నారు. ఇందులో సివిల్ సర్వీసెస్ గ్రూప్-ఏ, సివిల్ సర్వీసెస్ గ్రూప్-బి, హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్, వ్యవసాయ-అనుబంధ విభాగాలు, సాంకేతిక, బోధనతోపాటు స్పెషల్ సర్వీసెస్ ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని శాఖలు మొత్తం ఖాళీలను ఆయా కేటగిరీల్లోనే ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం సూచించింది.
రాత పరీక్ష లేకుండానే...
పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న కోణంలో కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా పరీక్షల నిర్వహణ గురించి ప్రధానంగా యోచిస్తున్నారు. ఇందుకుగాను నాలుగు విధానాలను పరిగనణలోకి తీసుకుంటున్నారు. ప్రిలిమనరీ-మెయిన్-ఇంటర్వ్యూ , రాత పరీక్ష-ఇంటర్వ్యూ, రాత పరీక్ష మాత్రమే, నేరుగా ఇంటర్వ్యూ విధానాల్లో ఒక దానిని సూచించాలని శాఖలకు సాధారణ పరిపాలన విభాగం సూచించింది.
జోనల్ మార్పులపైనా సమాలోచనలు..
ఇదిలా ఉండగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించి జోనల్ విధానాలపైనా సూచనలు కోరింది. రాష్ట్ర-మళ్టీ జోన్‌ల మధ్య మార్పులు, మల్టీ జోన్-జోన్ మధ్య, జోన్-జిల్లా, జిల్లా-జోన్ మధ్య మార్పులపైనా ప్రతిపాదనలు, సూచనలు ఇవ్వాలని కోరింది. మొత్తం సూచనల కోసం ఒక నమూనా పత్రాన్ని కూడా అన్ని శాఖలకు పంపింది.
:: Also Read ::
ఏపీ పోలీసు శాఖలో ఉద్యోగాల జాతర- 6,511 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6,511 పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకరం తెలిపారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఆరువేలకుపైగా ఉద్యోగాల్లో ఆర్‌ఎస్‌ఐ ఉద్యోగాలు 96 ఉంటే... ఎస్‌ఐ సివిల్ ఉద్యోగాలు 315 ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2520, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3580 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఏపీ హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తుకు 2 రోజులే గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 30న ప్రారంభం కాగా.. అక్టోబరు 22తో గడువు ముగియనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఇంగ్లిష్ టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టులు, నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉండాలి!
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10 నుండి ప్రారంభంకానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..