అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. దీని ద్వారా మొత్తం 30 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 24 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కాగా 6 ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ(లా) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.


సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 06 వరకు ఆన్‌లైన్ ద్వార దరఖాస్తుచేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది. గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తారు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 30


* సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్)


అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.


వయోపరిమితి: 01.03.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.


జీతభత్యాలు: నెలకు రూ.77,840 - రూ.1,36,520 చెల్లిస్తారు.


స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.


పరీక్ష విధానం: 


➥ స్క్రీనింగ్ టెస్ట్ ఇలా..
మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. స్క్రీనింగ్ పరీక్ష 40 శాతం ఆపై మార్కులు సాధించిన అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్షను కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. ఈ మార్కులను రాతపరీక్షలో కలపరు.

➥ రాతపరీక్ష ఇలా..
రాతపరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కులు ఉంటాయి. వీటిలో పేపర్-1 సివిల్ లా, పేపర్-2 క్రిమినల్ లా, పేపర్-3 ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ టెస్ట్ (ఇంగ్లిష్-తెలుగు, తెలుగు-ఇంగ్లిష్). ఇంగ్లిష్‌లో 25 మార్కులు ఎస్సే రైటింగ్ టెస్ట్, 75 మార్కులు లీగల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17.03.2023.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.04.2023.


🔰స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 15.04.2023.


🔰 స్క్రీనింగ్ పరీక్ష తేదీ(కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 24.04.2023.


🔰 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ: 27.04.2023.



Notification  


Website 


Also Read:


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ - 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 5369 సెలక్షన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు మార్చి 27లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 106 ఎగ్జిక్యూటివ్ పోస్టులు!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రిఫైనరీ యూనిట్లలో ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. డిప్లొమా, బీఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎంపికైనవారు బరౌని, గుజరాత్, హాల్దియా, పానిపట్, దిగ్బాయ్, పారాదీప్ రిఫైనరీ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...