ఏపీ హైకోర్టులో 241 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీని హైకోర్టు అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 20న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జనవరి 14 నుంచి హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జనవరి 23న లేదా అంతకుముందు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రొవిజనల్ ఎంపిక జాబితాను ఫిబ్రవరి 13న లేదా అంతకుముందు ప్రకటించే అవకాశం ఉంది. 


ఇక టైపిస్టు, కాపీయిస్టు, డ్రైవర్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 25న స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో అర్హత సాధించిన వారి జాబితాను మార్చి 3న ప్రకటిస్తారు. సెక్షన్ ఆఫీసర్/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్/ఆఫీసు సబార్డినేట్, అసిస్టెంట్, ఎగ్జామినర్, ఓవర్‌సీర్/ అసిస్టెంట్ ఓవర్‌సీర్, టైపిస్ట్, కాపీయిస్టు పోస్టులకు(కామన్‌ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. హైకోర్టులో 241 పోస్టుల్లో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే ఉన్నాయి. ఇక మిగతా పోస్టుల్లో 36-టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు; 27-అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులు ఉండగా.. మిగతావి ఓవర్ సీర్, అసిస్టెంట్ ఓవర్ సీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 


హైకోర్టు ఖాళీల వివరాలు: 241 పోస్టులు


పోస్టులు, పరీక్ష విధానం..


➥ ఆఫీస్ సబార్డినేట్: 135 పోస్టులు 


➥ టైపిస్ట్, కాపీయిస్ట్: 36 పోస్టులు


➥ అసిస్టెంట్, ఎగ్జామినర్: 27 పోస్టులు 


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13 పోస్టులు


➥ కంప్యూటర్ ఆపరేటర్: 11 పోస్టులు


➥ సెక్షన్ ఆఫీసర్/ కోర్టు ఆఫీసర్/స్క్రూటినీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు


➥ డ్రైవర్: 08 పోస్టులు


➥ ఓవర్‌సీర్: 01 పోస్టు


➥ అసిస్టెంట్ ఓవర్‌సీర్: 01 పోస్టు 


రాతపరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కోప్రశ్నలకు ఒకమార్కు ఉంటుంది. వీటిలో జనరల్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-30 ప్రశ్నలు-30 మార్కులు, మెంటల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో కటాఫ్ మార్కులను జనరల్/ఈడబ్ల్యూఎస్-40 శాతం, బీసీ-35 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ప్రకటిస్తారు. 


Also Read:


సుప్రీం కోర్టులో 'కోర్టు అసిస్టెంట్' ఉద్యోగాలు, అర్హతలివే!
సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా రిజిస్ట్రీ విభాగంలో కోర్టు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 31తో గడువు ముగియనుంది. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, టెక్నికల్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...