ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న అడహాక్ ప్రొఫెసర్‌లకు 10 శాతం మార్కులు వెయిటేజీ ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. భర్తీ సమయంలో 1:12 మంది వంతున, వారి నుంచి మళ్లీ 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారన్నారు. ఈ ప్రక్రియలో సదరు అధ్యాపకుడు అకడమిక్‌గా సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి సైతం బోధన సిబ్బంది నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని (రేషనలైజేషన్ ప్రక్రియను) అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఏ వర్సిటీకి ఎంతమంది బోధనేతర సిబ్బంది అవసరమో లెక్కించి నివేదిక ఇవ్వడానికి ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ రహమాన్‌తో కమిటీని నియమించామని వివరించారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి అధ్యాపకుల నియామకాలు జరగడం లేదు. యూనివర్శిటీల్లో శాశ్వత అధ్యాపకుల నియామకాలు చేపట్టి 17 ఏళ్లు పూర్తయింది. ఖాళీ అయిన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్న వైసీపీ ప్రభుత్వం యూనివర్శిటీల్లో క్వాలిటీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో ఉన్న 18 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సుమారు 12 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరందరికీ నాణ్యమైన, ఆధునిక సాంకేతికతో కూడిన విద్యనందించేలా ముందుకెళ్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
ALSO READ:
ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పార్ట్ టైమ్ కరస్పాండెంట్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..