AP DSC : 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ - ఏపీ సర్కార్ ప్రకటన !

ఏపీ ప్రభుత్వం 502 పోస్టులతో లిమిటెడ్ డీఎస్సీని ప్రకటించింది. ధరఖాస్తుల స్వీకరణ ఆగస్టు

Continues below advertisement

AP DSC :  ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, MPP స్కూళ్లలో 199పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 81పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, DSCలో TET మార్కులకు 20% వెయిటేజీ కల్పించారు. నేటి(ఆగస్టు 23) నుంచి సెప్టెంబర్‌ 17వరకు ఫీజు చెల్లింపు గడువుగా నిర్దేశించారు. ఈనెల 25-సెప్టెంబర్‌ 18వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌ 23న పరీక్ష, నవంబర్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.

Continues below advertisement


AP Jobs: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 351 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, అర్హతలివే!

డీఎస్సీలో టెట్ మార్కెలకు 20 శాతం వెయిటేజ్ కేటాయించారు. ఫీజు చెల్లింపు గడువు  సెప్టెంబర్ 17 వరకు ఉంటుంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఆగ‌స్టు 23వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు మెగా డీఎస్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో వేల మంది నిరుద్యోగులు.. టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని చాలా సార్లు ప్రభుత్వం ప్రకటించింది. 

 

Also Read: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!

 

‘‘రాష్ట్రంలో సుమారు 6 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్ట్‌ టీచర్లతో బోధన ఉండేలా చూస్తున్నాం. దీనికోసం 35-40 వేల స్కూల్‌ అసిస్టెంట్లు అవసరం ఉంది. ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించి.. అనంతరం ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాం’’ అని ఓ సారి అసెంబ్లీకి మంత్రి స్వయంగా సమాధానం ఇచ్చారు. ఎంఈవో-2 పోస్టుల ఏర్పాటు కోసం ఇప్పటికే ఉన్న టీచర్‌ పోస్టులను రద్దు చేసి ఆ స్థానంలో వాటిని తీసుకు వస్తున్నారు.  


Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!

 

ప్రస్తుత ప్రభుత్వం స్కూళ్ల రేషనలైజేషన్ చేయడంతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయంది. గత మూడేళ్లుగా ఎలాంటి టీచర్ రిక్రూట్‌మెంట్ చేయకపోయినా ఇప్పుడు అతి స్వల్ప మొత్తం పోస్టులతో లిమిటెడ్ డీఎస్సీ వేయడంతో అభ్యర్థుల్లోనూ అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేదు. ఒకటి విడుదల చేసినా అందులో పోస్టులు పదుల సంఖ్యలోనే ఉండటంతో చాలా మంది ఆందోళనలకు దిగారు. 

 

Related Articles:

APSACS Jobs: ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో 140 ఖాళీలు - టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతలు!
ఏపీలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద వివిధ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులు కోరుతుంది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలను నిర్ణయించారు. దీనిప్రకారం పదోతరగతి, ఎంబీబీఎస్, సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజి, ఆంత్రోపాలజి, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ,పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయసు పోస్టల వారీగా 18-42, 18-62, 18-65  సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత జిల్లా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చు. దరఖాస్తు నింపి సంబంధిత జిల్లా కార్యాలయాల్లో తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి... 

 

AP Jobs: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 పోస్టులు, వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య  & కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి... 

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola