ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో వయసు మీరిన నిరుద్యో­గులకు మేలు చేకూర్చే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఇతర రిక్రూట్‌మెంట్‌ ఏజె­న్సీలు నేరుగా భర్తీ చేసే నాన్‌ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం (అక్టోబరు 10) ఉత్తర్వులు జారీ చేశారు.


రాష్ట్రంలో నాన్‌-యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయో­పరిమితి ఇప్పటివరకు 34 సంవత్సరాలుగా ఉండేది. తాజా ఉత్తర్వులతో వయోపరిమితి 34 నుంచి 42 సంవత్సరాలకు పెరిగింది. అదేవిధంగా యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు వర్తించనుంది. 


ఏపీపీఎస్సీతో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నియామకాల్లో మాత్రమే ఇది పని చేయనుండగా.. యూనిఫాం సర్వీసులు అంటే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖలకు సంబందించిన నియామకానికి ఈ వయోపరిమితి వర్తించదు.


ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న సందర్భాల్లో వయోపరిమితి పెంచుకుంటూ వస్తోంది. గరిష్ట వయసు దాటిపోయిన నిరుద్యోగులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు వయోపరిమితిని పెంచుతూ జీవో లు జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు పలు బోర్డుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితిని పెంచింది.



ALSO READ:


తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి వచ్చే ఏడాదికి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని సమావేశంలో కమిషన్ నిర్ణయించింది. కొత్త తేదీల ఖరారుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..