Government Jobs In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 40 ఏఈఈ పోస్టులు, 35 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఏపీకి చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 70.


⏩ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 


పోస్టుల కేటాయింపు: ఓసీ-15, బీసీ-09, ఎస్సీ-05, ఎస్టీ-03, ఈడబ్ల్యూఎస్-03.


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.


వేతనం: రూ.35,000. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.


⏩ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 


పోస్టుల కేటాయింపు: ఓసీ-03, బీసీ-01, ఎస్సీ-01.


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.


వేతనం: రూ.35,000. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.


⏩ టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు


పోస్టుల కేటాయింపు: ఓసీ-13, బీసీ-08, ఎస్సీ-05, ఎస్టీ-02, ఈడబ్ల్యూఎస్-02.


అర్హత: బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్‌సీఈ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 


వేతనం: రూ.25,000. ఇతర భత్యాలు అదనంగా ఇస్తారు.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.500. ''IE(I)-Engineering Staff College of India, Hyderabad పేరిట నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


దరఖాస్తుకు చివరితేదీ: 05.01.2024.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Convener,
Recruitment Services,
Power & Energy Division
Engineering Staff College of India,
Old Bombay Road, GachiBowli,
Hyderabad– 500 032.


Notification 


Application Form for A.E.Es 


Application Form for Technical Assistants


Website


ALSO READ:


స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 92 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, నెలకు రూ.1.8 లక్షల వరకు జీతం
భారత ప్రభుత్వరంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 11న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


యూకో బ్యాంకులో 127 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఎంపిక ఇలా
కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 127 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించి డిసెంబరు 27లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...