APETD: ఏపీ ఐటీఐల్లో 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా

APETD Recruitment: ఏపీలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

APETD Recruitment: ఏపీలోని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బి.ఒకేషనల్‌, డిగ్రీ, డిప్లొమా, ఎన్‌టీసీ, ఎన్‌ఏసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక్కో పోస్టుకి దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 6న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష, ప్రాక్టికల్‌ డెమో, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 71

* అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు

జోన్‌ల వారీగా ఖాళీలు..

⏩ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- I): 06

ట్రేడ్‌‌ల వారీగా ఖాళీలు..

➥ డ్రెస్ మేకింగ్- 01

➥ మెషినిస్ట్- 01

➥ ఫిట్టర్- 02

➥ కార్పెంటర్- 01

➥ వెల్డర్- 01

⏩ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- II): 08

ట్రేడ్‌‌ల వారీగా ఖాళీలు..

➥ ఇంజినీరింగ్ డ్రాయింగ్- 01

➥ టర్నర్- 03

➥ మెషినిస్ట్- 01

➥ మెకానిక్ డీజిల్- 01

➥ ఫిట్టర్- 01

➥ మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 01

⏩ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- III): 03

ట్రేడ్‌‌ల వారీగా ఖాళీలు..

➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 02

➥ ఫిట్టర్- 01

⏩ అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్(జోన్- IV): 54

ట్రేడ్‌‌ల వారీగా ఖాళీలు..

➥ సీవోపీఏ- 03

➥ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్- 13

➥ మెషినిస్ట్- 01

➥ ఎలక్ట్రానిక్ మెకానిక్- 02

➥ టర్నర్- 01

➥ డ్రెస్ మేకింగ్- 01

➥ ఎలక్ట్రీషియన్- 10

➥ ఫిట్టర్- 08

➥ మ్యాథ్స్ కమ్ డ్రాయింగ్- 05

➥ మెకానిక్ డీజిల్- 02

➥ మెకానిక్ మోటార్ వెహికల్- 03

➥ వెల్డర్- 04

➥ వైర్‌మెన్- 01

అర్హత: సంబంధిత విభాగంలో బి.ఒకేషనల్‌/ డిగ్రీ/ డిప్లొమా/ ఎన్‌టీసీ / ఎన్‌ఏసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓసీ-42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్- 47 సంవత్సరాలు, పీహెచ్-52 సంవత్సరాలు వయోసడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

పదవీకాలం: కాంట్రాక్టు సమయం విద్యా సంవత్సరంలో(ఆగస్టు నుండి జూలై వరకు) పదవీ కాలం 11 నెలలకు మించి ఉండదు . ఎట్టి పరిస్థితుల్లోనూ గరిష్టంగా 3 సంవత్సరాల కంటే ఎక్కువ పొడిగింపు ఉండదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ డెమో, పని అనుభవం తదితరాల ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులు. అందులో రాత పరీక్ష: 70 మార్కులు, AP రాష్ట్ర ప్రభుత్వలో అనుభవం: 10 మార్కులు, ట్రేడ్‌లో ప్రాక్టికల్ డెమో: 20 మార్కులు కెటాయించారు.

వేతనాలు: నెలకు రూ:35,570.

హాల్ టిక్కెట్లు: అర్హతగల అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు వారి మెయిల్‌కు పంపబడతాయి. అయితే ఏదైనా తప్పు మెయిల్ అడ్రస్ ఇస్తే డిపార్ట్‌మెంట్ బాధ్యత వహించదు. 

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 1.03.2024.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.03.2024.

🔰 రాత పరీక్ష తేదీ: 06.05.2024.

Notification

Press Note

Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola