విజయనగరంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారతా అధికారి కార్యాలయం విజయనగరం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పలు అంగన్వాడీ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోవతరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగులో చదవుట, వ్రాయుట తప్పనిసరి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 10లోగా దరఖాస్తుచేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 60.


1. అంగన్వాడి వర్కర్: 10 పోస్టులు


2. అంగన్వాడి హెల్పర్: 44 పోస్టులు


3. మినీ అంగన్వాడి వర్కర్: 06 పోస్టులు


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-35 సంవత్సరాలు మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.


ఎంపిక విధానం: పదోవతరగతిలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11,500; అంగన్‌వాడీ హెల్పర్/ మినీ అంగన్వాడి వర్కర్‌కు రూ.7000.


నోటిఫికేషన్:



ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023.


 


Notification 


Website 


Also Read:


SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక  హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయన్నమాట.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


కృష్ణా జిల్లా, డీఎంహెచ్‌వోలో రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, అర్హతలివే!
మచిలీపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 10లోపు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 16న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ జాబితా, ఫిబ్రవరి 20న తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
'సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్)-2023' నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 21 వరకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...