Andhra Pradesh DSC Results 2025: అమరావతి: ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పదిహేనులోగా డీఎస్సీ రిజల్ట్స్ విడుదల చేస్తే.. ఆగస్టు 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొదలుకానుంది. ప్రాసెస్ మొత్తం పూర్తయితే పోస్టులకు ఎంపికైన తుది జాబితాను విడుదల చేసి ఆగస్టు నెలాఖరుకు పోస్టింగ్ ఇవ్వాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 

16,347 మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు విద్యాశాఖ ప్లాన్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అంతా సక్రమంగా జరిగితే ఆగస్టు 16వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించనున్నారు. కాగా, కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ఆగస్టు నెలాఖరు నాటికి కొత్త టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారికి పోస్టింగులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణను పోస్టింగ్‌లకు ముందే విద్యాశాఖ పూర్తి చేస్తుంది. కానీ ఇదివరకే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా స్కూళ్లల్లో టీచర్ల కొరత ఏర్పడటంతో 4, 5 శనివారం, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబరు మొదటి వారం నుంచే స్కూళ్లలో కొత్త టీచర్లు చేరనున్నారు. 

స్పోర్ట్స్ కోటా వివరాల కోసం వెయిటింగ్ఏపీ డీఎస్సీలో క్రీడల విభాగం (Sports Quota)లో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు శాప్ నుంచి విద్యాశాఖకు ఇంకా అందలేదు. శాప్ నుంచి వివరాలు అందగానే ఆయా జిల్లాల్లో కటాఫ్ మార్కులను పాఠశాల విద్యాశాఖ ప్రకటిస్తుంది. ఆలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in లో ఫలితాలు,  తుది కీ యాక్సెస్ చేయవచ్చు.  

శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్లు (SA), ప్రిన్సిపాల్స్ , ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET) వంటి పోస్టులను ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఏపీ డీఎస్సీ ఫలితాలను ఎలా చెక్ చేయాలి:

AP DSC అధికారిక వెబ్‌సైట్ www.apdsc.apcfss.inని సందర్శించండి.హోమ్‌పేజీలో “AP DSC Results 2025” లింక్‌ మీద క్లిక్ చేయండి.మీ రోల్ నంబర్ లేక రిజిస్ట్రేషన్ నంబర్, డేటాఫ్ బర్త్ వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి“సబ్మిట్” బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై డీఎస్సీ రిజల్ట్ కనిపిస్తుంది.DSC Result డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకుంటే మంచిది