ఏపీలో దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక విద్యకు సంబంధించి సెకండరీ స్టేజీ(ఐఈడీఎస్‌ఎస్‌)లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తుకు చివరితేది సెప్టెంబరు 18. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


 


ఖాళీల వివరాలు:


 


స్కూల్ అసిస్టెంట్(ప్రత్యేక విద్య):  81 పోస్టులు


 


జిల్లాల వారీగా ఖాళీలు:



  1. శ్రీకాకుళం:  04


  2. విజయనగరం: 07


  3. విశాఖపట్నం:  06


  4. తూర్పు గోదావరి: 06


  5. పశ్చిమ గోదావరి: 06 


  6. కృష్ణా: 07


  7. గుంటూరు:  06


  8. ప్రకాశం: 06


  9. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: 09


  10. వైఎస్ఆర్ కడప: 07


  11. చిత్తూరు: 05


  12. అనంతపురం: 10


  13. కర్నూలు: 02


 


TSPSC Recruitment: ములుగు ఫారెస్ట్ కాలేజీలో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!



అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ప్రత్యేక విద్యలో బీఈడీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ (జనరల్), డిప్లొమా(ప్రత్యేక విద్య) ఉత్తీర్ణులై ఉండాలి. 


 


ఎంపిక విధానం: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టెట్‌కం టీఆర్‌టీ), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా. 


 


దరఖాస్తు ఫీజు:  రూ.500.


 


ముఖ్యమైన తేదీలు:


ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.


ఆన్‌లైన్  దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.


హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.


ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.


పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.


ఫలితాల ప్రకటన: 04.11.2022.


 


Notification


 


Website


Also Read:


TSPSC Recruitment: ములుగు ఫారెస్ట్ కాలేజీలో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.500 చెల్లించి సెప్టెంబరు 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే పరీక్ష ఫీజు చెల్లించాలి.  
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:

TSPSC Notification: తెలంగాణలో DAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ వ‌ర్క్స్ అకౌంట్స్ స‌ర్వీస్‌లో డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు సెప్టెంబరు 6లోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్ తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...