AP DSC Hall Tickets Download 2025 | ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు రాసే డీఎస్సీ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ సూచించింది. ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల సందర్భంగా జూన్ 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఆ పరీక్షలను జూలై 1, 2 తేదీలలో నిర్వహించనున్నారు. 

తాజాగా జరగనున్న ఈ పరీక్షలు రాసే డీఎస్సీ అభ్యర్థులు ఏపీ డీఎస్సీ. ఏపీసిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో (apdsc.apcfss.in) హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ, మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి డీఎస్సీ అభ్యర్థులకు తెలిపారు. కొత్త హాల్టికెట్లలో పరీక్షా కేంద్రాలు నిర్ధారించుకుని ఎగ్జామ్స్ కు హాజరుకావాలని సూచించారు. అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని దాని ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని కోరారు. ఆదివారం జరిగిన స్కూల అసిస్టెంట్ తెలుగు పరీక్షకు 18,231 మంది హాజరయ్యారు. దాదాపు 1500 మంది ఈ పరీక్షకు గైర్హాజరయ్యారనీ అధికారులు తెలిపారు.