ఏపీ వైద్యారోగ్య శాఖ వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) విభాగాల పరిధిలోని పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. నిర్ణీత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు...మొత్తం ఖాళీలు: 2318 జిల్లాలవారీగా ఖాళీలు: 

1) శ్రీకాకుళం : 144

2) విజయనగరం : 194 

3) విశాఖపట్నం : 192

4) తూర్పుగోదావరి : 322

5) పశ్చిమగోదావరి : 237

6) కృష్ణా : 296

7) గుంటూరు : 132

8) ప్రకాశం : 166

9) నెల్లూరు : 85

10) చిత్తూరు : 162

11) కర్నూలు : 129

12) కడప : 88

13) అనంతపురం : 171

Also Read: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం, 42 రకాల పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్!

‌అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు. వయోపరిమితి: 01.07.2022 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము: రూ.250. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ విధానంలో. దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి. ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో 85 శాతం మార్కులు అభ్యర్థి విద్యార్హత, 15 శాతం మార్కులు పని అనుభవానికి కేటాయించారు. దరఖాస్తుకు చివరితేది: 20.08.2022. 

Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే! ముఖ్యమైన తేదీలు..

* నోటిఫికేషన్ వెల్లడి: 05-08-2022

* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 06-08-2022 నుంచి 20-08-2022 వరకు.

* దరఖాస్తుల పరిశీలన: 25-08-2022.

* అభ్యర్థుల మెరిట్‌లిస్ట్: 26-08-2022.

* మెరిట్‌లిస్ట్‌పై అభ్యంతరాలు: 27-08-2022 నుంచి 28-08-2022 వరకు.

* అభ్యర్థుల తుది ఎంపిక జాబితా: 29-08-2022.

* కౌన్సెలింగ్, నియామక ఉత్తర్వులు: 31-08-2022.

Srikakulam Notification & ApplicationWebsite

Vizianagaram  Notification & ApplicationWebsite

Visakhapatnam Notification & ApplicationWebsite

East Godavari Notification & ApplicationWebsite

West Godavari Notification & ApplicationWebsite

Prakasam Notification & ApplicationWebsite

NelloreNotificationApplcationWebsite

Krishna Notification & ApplicationWebsite

GunturNotificationApplicationWebsite

KurnoolNotificationApplicationWebsite

AnantapurNotification & ApplicationWebsite

KadapaNotification & ApplicationWebsite

ChittorNotification & ApplicationWebsite

 

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...