AP DME Recruitment: ఏపీ మెడికల్ కాలేజీల్లో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎపుడంటే?

ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామాకాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Continues below advertisement

DME Recruitment: ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ మొత్తం 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 

Continues below advertisement

వివరాలు..

* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 255 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

1) అనస్థీషియా: 34 పోస్టులు

2) డెర్మటాలజీ: 06 పోస్టులు

3) ఎమర్జెన్సీ మెడిసిన్: 16 పోస్టులు

4) ఈఎన్‌టీ: 03 పోస్టులు

5) జనరల్ మెడిసిన్: 30 పోస్టులు

6) జనరల్ సర్జరీ: 18 పోస్టులు

7) హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 05 పోస్టులు

8) న్యూక్లియర్ మెడిసిన్: 02 పోస్టులు

9) ఓబీజీ: 24 పోస్టులు

10) ఆర్థోపెడిక్స్: 08 పోస్టులు

11) పీడియాట్రిక్స్: 16  పోస్టులు

12) సైకియాట్రి: 15 పోస్టులు

13) రేడియో డయాగ్నోసిస్: 26 పోస్టులు

14) రేడియోథెరపీ: 02 పోస్టులు

15) టీబీ & సీడీ: 02 పోస్టులు

16) ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్: 03 పోస్టులు

17) ఆఫ్తల్మాలజీ: 11 పోస్టులు

18) ఫోరెన్సిక్ మెడిసిన్: 08 పోస్టులు

19) పాథాలజీ: 12 పోస్టులు

20) ఎస్‌పీఎం: 14 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 52 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్‌మెన్ 50 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.1000. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటో

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదొవతరగతి సర్టిఫికేట్ కాపీ.

➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్. తెలంగాణలో 4 నుంచి 10వ తరగతి చదివి విభజన తర్వాత ఏపీకి వలస వచ్చినట్లయితే రెవెన్యూ అధికారుల నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి.

➥ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్.

➥ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్.

➥ పీజీ డిగ్రీ సర్టిఫికేట్/సూపర్-స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్.

➥ పీజీ డిగ్రీ మార్కుల మెమో/సూపర్-స్పెషాలిటీ డిగ్రీ మార్కుల మెమో.

➥ సీనియర్ రెసిడెన్సీ (SR) పూర్తి సర్టిఫికేట్.

➥ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.

➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).

➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.

➥ మెరిటోరియస్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు(స్పోర్ట్స్ కోటా కింద).

➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు. 

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2024.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola