AHA Exam 2023: ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధక శాఖలో 'ఏనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌' (Animal Husbandry Assistant) పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 31న రాత పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు డిసెంబర్‌ 27న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్/ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.22,460- రూ.72,810 వేతనం ఉంటుంది.


ఏపీ పశుసంవర్ధక శాఖలో ఏనిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 1896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic), ఇంటర్ ఒకేషనల్ (Inter Vocational) కోర్సు, బీటెక్ (BTech), బీఎస్సీ (BSc), ఎంఎస్సీ(MSc) అర్హత ఉన్నవారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ పోస్టుల భర్తీకి నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 12 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులకు డిసెంబరు 31న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్‌ 27న విడుదల చేయనున్నారు. రాతపరీక్షలో ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో రెండు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. పార్ట్-ఎలో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు-50 మార్కులు-50 నిమిషాలు, పార్ట్-2బిలో ఏనిమల్ హస్బెండరీ సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులు-100 నిమిషాలు ఉంటాయి. 



పోస్టుల వివరాలు..


* యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ (AHA) పోస్టులు


ఖాళీల సంఖ్య: 1896.


జిల్లాలవారీగా ఖాళీలు..


➥ అనంతపురం: 473 పోస్టులు


➥ చిత్తూరు జిల్లా: 100 పోస్టులు


➥ కర్నూలు జిల్లా: 252 పోస్టులు


➥ వైఎస్‌ఆర్‌ కడప: 210 పోస్టులు


➥ నెల్లూరు జిల్లా: 143 పోస్టులు


➥ ప్రకాశం జిల్లా: 177 పోస్టులు


➥ గుంటూరు జిల్లా: 229 పోస్టులు


➥ కృష్ణా జిల్లా: 120 పోస్టులు


➥ పశ్చిమ గోదావరి జిల్లా: 102 పోస్టులు


➥ తూర్పు గోదావరి జిల్లా: 15 పోస్టులు


➥ విశాఖపట్నం జిల్లా: 28 పోస్టులు


➥ విజయనగరం జిల్లా: 13 పోస్టులు


➥ శ్రీకాకుళం జిల్లా: 34 పోస్టులు


నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


గుంటూరు జీజీహెచ్‌లో 94 పారామెడికల్ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గుంటూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 94 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...