భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు-2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఏడో జాబితాను పోస్టల్ శాఖ నవంబర్ 10న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఏపీ సర్కిల్‌లో 326 మంది అభ్యర్థులు, తెలంగాణ సర్కిల్‌లో 162 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.


ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. జీడీఎస్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు నవంబర్ 24 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.


ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.. 

➽ ముందుగా అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్‌ చేయండి. 

➽ హోమ్‌ పేజ్‌లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న 'Shortlisted Candidates' లింక్‌ పై క్లిక్‌ చేయండి 

➽ తర్వాత రాష్ట్ర సర్కిల్ ఎంపిక చేసుకోవాలి

➽ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఫలితాల పీడీఎఫ్‌ డౌన్ లోడ్ చేసుకోండి

➽ ఈ పీడీఎఫ్ లో ఫలితాలు చెక్ చేసుకోండి.


ఏపీ జీడీఎస్ ఫలితాలు

తెలంగాణ జీడీఎస్ ఫలితాలు


షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం స్థానిక హెచ్ పోస్ట్ ఆఫీసులో నవంబరు 24 లోపు హాజరు కావాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం ఎంపికైన అభ్యర్థులకు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియపరుస్తారు. నిర్ణీత గడువు దాటాక ఎట్టిపరిస్థితుల్లోనూ ధ్రువపత్రాల పరిశీలనకు అనుమతించరు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను, ఒక జత జిరాక్స్ కాపీలను, ఫోటోలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.   


 


:: Also Read ::


రెప్కో బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హతలివే!
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న 'రెప్కో' బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతోపాటు స్థానిక భాషపై అవగాహన ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 25 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి


JIPMER Jobs: జిప్‌మర్‌‌లో 433 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు ప్రారంభం!
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(జిప్‌మర్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...