గుంటూరు లాంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ సీఎస్ స్కీమ్‌లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్థు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 10 వరకు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 46


1. ఫీల్డ్ సూపర్‌వైజర్: 05


2. స్టాటిస్టిషియన్: 01 పోస్టు


3. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్: 34


4. కంప్యూటర్ స్టాఫ్‌: 03


5. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 03


అర్హతలు: పోస్టులను అనుసరించి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: కంప్యూటర్ స్టాఫ్/ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: andhrapradeshcss@gmail.com


దరఖాస్తుకు చివరి తేదీ: 10. 05.2023.


Notification 




Website 


Also Read:


ఇస్రోలో 65 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/యూనిట్‌లలో 65 సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 4న ప్రారంభంకాగా.. మే 24 వరకు కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 428 ఇంజినీర్‌ పోస్టులు, వివరాలు ఇలా!
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 428 ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మే 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఎన్‌సీఈఆర్‌టీలో 347 ఉద్యోగాలు- వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీచేస్తారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 19 ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సీఆర్‌పీఎఫ్‌లో 212 సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- అర్హతలివే!
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్- బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన  అర్హతలు గల అభ్యర్థులు మే 1 నుంచి 21 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..