వైఎస్సార్ కడపలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారతా అధికారి కార్యాలయం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 115 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు ఉన్నాయి. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు పదోతరగతి అర్హత ఉండాలి. అదేవిధంగా అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీలకు 7వ తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6లోపు సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు...


మొత్తం ఖాళీల సంఖ్య: 115


➥ అంగన్‌వాడీ వర్కర్: 19 పోస్టులు


➥ అంగన్‌వాడీ హెల్పర్: 89 పోస్టులు


➥ మినీ అంగన్‌వాడీ వర్కర్: 07 పోస్టులు


అర్హత: అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు పదోతరగతి. అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీలకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: 7, 10వ తరగతుల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తుకు చివరితేది: 06.02.2023.


➥ ఇంటర్వ్యూ తేదీ: 11.02.2023.


Notification & Application


Website 



Also Read:


NLC Apprenticeship: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 626 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 22 నుంచి 28  వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!
ఇండియ‌న్ నేవీ - 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంత‌రం నేవీలోనే ఉన్నత‌ హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. జనవరి 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియ‌న్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...