ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఆగస్టు 17న విడుదల చేసింది. సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 6 వరకు నిర్వహించనున్న పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. వీటిలో గ్రూప్-4 పరీక్షతోపాటు.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, నాన్ గెజిటెడ్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తేదీలు ఉన్నాయి. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షల తేదీలను చూసుకోవచ్చు. 

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు మినహాయించి.. మిగతా అన్ని పోస్టులకు సంబంధించి పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి) పరీక్షను అక్టోబరు 3న నిర్వహించనున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పేపర్-1 పరీక్షను సెప్టెంబరు 29న, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పేపర్-1 పరీక్షను అక్టోబరు 6న నిర్వహించనున్నారు. ఇక మిగతా సబ్జెక్టులవారీగా పేపర్లను షెడ్యూలు ప్రకారం వివిధ తేదీల్లో నిర్వహించనున్నారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పరీక్షల తేదీలు ఇలా..

1) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఏపీ ఫారెస్ట్ సర్వీస్)

25.09.2023 
↪ క్వాలిఫైయింగ్ పేపర్: జనరల్ ఇంగ్లిష్ & జనరల్ తెలుగు (ఉ. 9.30 గం. - ఉ.11.10 గం.) 
↪ పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (మ.2.30 గం. - సా. 5.00 గం.)

26.09.2023

↪పేపర్-2: మ్యాథమెటిక్స్ (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.) 
↪ పేపర్-3: జనరల్ ఫారెస్ట్రీ-1 (మ.2.30 గం. - సా. 5.00 గం.)

27.09.2023
↪ పేపర్-4: జనరల్ ఫారెస్ట్రీ-2 (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

2) సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్)

27.09.2023: పేపర్-2: మెడికల్ సైన్స్, జనరల్ మెడిసిన్ & జనరల్ సర్జరీ (మ.2.30 గం. - సా. 5.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

3) నాన్ గెజిటెడ్ పోస్టులు

➥ టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) - ఏపీ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్
27.09.2023: పేపర్-2: జియోఫిజిక్స్ (మ.2.30 గం. - సా. 5.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

➥ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్)
27.09.2023: పేపర్-2: బేసిక్ ఫిషరీస్ & అప్లయిడ్ ఫిషరీస్ (మ.2.30 గం. - సా. 5.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

➥ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఏపీ ఇండస్ట్రియల్ సబార్టినేట్ సర్వీస్)
03.10.2023: పేపర్-2: అప్లయిడ్ సైన్స్, ఇంజినీరింగ్ & మేనేజ్‌మెంట్ (మ.2.30 గం. - సా. 5.00 గం.)
03.10.2023:  పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

➥ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)
04.10.2023: పేపర్-2: ఫుడ్ టెక్నాలజీ (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

4) గ్రూప్-4 పరీక్ష
04.10.2023: పేపర్-2: జనరల్ ఇంగ్లిష్ & జనరల్ తెలుగు (మ.2.30 గం. - సా. 5.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

5) నాన్ గెజిటెడ్ పోస్టులు
➥ జూనియర్ ట్రాన్స్‌లేటర్ (తెలుగు)
05.10.2023: పేపర్-2: ట్రాన్స్‌లేషన్ -డిస్క్రిప్టివ్ టైప్ (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

➥ టెక్నికల్ అసిస్టెంట్ (మైన్స్ & జియోలజీ)
05.10.2023: పేపర్-2: జియోలజీ (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

➥ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్
05.10.2023: పేపర్-2: సోషల్ వర్క్ అండ్ క్రిమినాలజీ/సైకాలజీ (మ.2.30 గం. - సా. 5.00 గం.)
03.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

6) అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ 
06.10.2023: పేపర్-2: ఆటోమొబైల్ ఇంజినీర్ (మ.2.30 గం. - సా. 5.00 గం.)
06.10.2023: పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటి (ఉ. 9.30 గం. - ఉ.12.00 గం.)

పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..