ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాలభర్తీకి సంబంధించిన రాతపరీక్షల షెడ్యూలును ఏపీపీఎస్సీ జులై 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 18న టౌన్‌ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 19, 21 తేదీల్లో నాన్-గెజిటెడ్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఆగస్టు 21, 22 తేదీల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
టౌన్‌ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాలకు..
➥ ఆగస్టు 18న టౌన్‌ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్‌సీర్ ఉద్యోగాలకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్టు) పరీక్షలు నిర్వహించనున్నారు.
నాన్-గెజిటెడ్ ఉద్యోగాలకు..
➥ ఆగస్టు 19న నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) పరీక్ష నిర్వహించనున్నారు.
➥ ఆగస్టు 21న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్టు) పరీక్ష నిర్వహించనున్నారు.
ఏఈఈ ఉద్యోగాలకు..
➥ ఆగస్టు 21న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) పరీక్ష నిర్వహించనున్నారు.
➥ ఆగస్టు 22న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2 (సివిల్, మెకానికల్/కామన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (సివిల్ & మెకానికల్) పరీక్షలు నిర్వహించనున్నారు.
ALSO READ:
'టెట్' నోటిఫికేషన్ వచ్చేస్తోంది, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు మొదటివారంలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ మూడోవారంలో టెట్ నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది. ఇటీవల సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 17, 18 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..