Civil Assistant Surgeon Posts | అమరావతి: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 


బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టులను పీహెచ్‌సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 4 నుండి 13వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్‌సైట్ http:apmsrb.ap.gov.in/msrb/ లో అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉంటుందని అభ్యర్థులకు సూచించింది.


మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు


ఏపీ ప్రభుత్వం మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. హాస్పిటల్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగినంత వైద్య సిబ్బంది, డాక్టర్లు అవసరం అని వైద్యశాఖ చెప్పింది. దీనిపై ఫోకస్ చేసిన అధికారులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేసి, మరింత మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సివిల్ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 4న దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అర్హత కలిగిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 13 వరకు ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయోపరిమితి, ఫీజు, అర్హతలు, ఇతరత్రా మొత్తం వివరాలకు నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ http:apmsrb.ap.gov.in/msrb/ సందర్శించాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు. 



Also Read: NTPC Jobs: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు రూ.1.20 లక్షల వరకు జీతం 


అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సేఫ్టీ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్‌ 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ (Engineering Qualification) డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హతలున్న ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబరు 10వ తేదీ లోగా ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలని సూచించింది. స్క్రీనింగ్ పరీక్ష, రాతపరీక్ష (Written Exam), ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థుల్ని ఎన్టీపీసీ ఎంపిక చేయనుంది. అసిస్టెంట్ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.1,20,000 వరకు జీతంగా చెల్లించనున్నారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 


Notification


Online Application


Website