AP Universities Assistant Professor Vacancy: ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా రంగంలో చారిత్రాత్మకమైన మార్పునకు నాంది పలుకుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ యూనివర్శిటీల్లోని సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించింది. మే 15, 2026న వెలువడిన ఈ నోటిఫికేషన్లు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయడమే కాకుండా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేడర్‌లో నియామకాలు చేపట్టడం ద్వారా పరిశోధన, బోధనా రంగాల్లో నూతన శక్తిని నింపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

Continues below advertisement

ముఖ్యమైన తేదీలు ఎప్పుడు ఏం జరుగుతోంది?

ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8వ తేదీ సాయంత్ర ఐదు గంటలు. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్ కాపీలను జూన్ 15 నాటికి ఆయా యూనివర్సిటీలకు చేరాలి. వాటిని అధికారులు పరిశీలించి 22వ తేదీని ప్రాథమిక అర్హుల జాబితాను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలు ఉంటే 29వ తేదీ వరకు చెప్పుకోవచ్చు. తర్వాత 30వ తేదీన స్క్రీనింగ్ టెస్టు తుది జాబితా ప్రదర్శిస్తారు. 

విశ్వవిద్యాలయాల వారీగా ఖాళీల వివరాలు 

రాష్ట్రంలోని 18 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

Continues below advertisement

యూనివర్శిటీ పేరు   

రెగ్యులర్ పోస్టులు 

బ్యాక్‌లాగ్ పోస్టులు

భర్తీ చేయనున్న సబ్జెక్టుల వివరాలు

ఆంధ్ర యూనివర్శిటీ   203  05  బయోకెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, లా, పొలికిటల్ సైన్స్, ఫిజిక్స్, సీఎస్‌ఈ
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం   86  02  ఆంత్రోపాలజీ, బాటనీ, కెమికల్ ఇంజినీరింగ్, తెలుగు, స్టాటిస్టిక్స్‌ 

జేఎన్‌టీయూ అనంతపురం 

75

04 

సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ 

 జెఎన్టీయూ కాకినాడ   41   03  సివిల్, మెకానికల్, సీఎస్‌ఈ, మేనేజ్‌మెంట్, ఇంగ్లీష్, మ్యాథ్స్‌, 
జేఎన్టీయూ జీవీ   30 04  సివిల్, ఎకనామిక్స్, మ్యాథ్స్, సీఎస్‌ఈ 
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం   49  18   సోషియాలజీ, లా, స్టాటిస్టిక్స్‌, బాటనీ, మేనేజ్‌మెంట్ 
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ    44  01  ఆర్కిటెక్చర్, బాటనీ, కామర్స్‌, ఎకామిక్స్‌, సివిల్‌, సీఎస్‌ఈ
రాయలసీమ విశ్వవిద్యాలయం 38  0     బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, తెలుగు, మ్యాథ్స్‌,

ఆర్జీయూకేటీ    

104  66   బయాలజీ, ఫిజిక్స్, ఇంజినీరింగ్ కోర్సులు, మేనేజ్‌మెంట్‌ 

యోగి వేమన విశ్వవిద్యాలయం   

0  19 బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, హిస్టరీ, మెకానికల్, సీఎస్‌ఈ

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాయం    

21  01  హోమ్‌సైన్స్‌, లా మైక్రోబయాలజీ, సీఎస్‌ఈ 

కృష్ణా విశ్వవిద్యాలయం 

  27   03  సీఎస్‌ఈ, ఇంగ్లీష్, మేనేజ్మెంట్, అప్లైడ్ మ్యాథ్స్‌
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం    

 

20  05బాటనీ, సీఎస్‌ఈ, ఇంగ్లీష్‌, ఎకనామిక్స్‌
డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విశ్వవిద్యాలయం    28  01  కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, సోషల్ వర్క్,
ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ   37  03   బాటనీ, కెమిస్ట్రీ, సీఎస్‌ఈ, మేనేజ్మెంట్‌, ఎకనామిక్స్‌
డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌వర్శిటీ  46  ---  పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, ఫిజిక్స్, సీఎస్‌ఈ, ఇంగ్లీష్‌

ద్రావిడ విశ్వవిద్యాలయం  

 

07  - -- కెమిస్ట్రీ, కామర్స్‌, మేనేజ్మెంట్‌

ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం  

 

08   

 

----ఏ సబ్జెక్ట్‌లో పోస్టులు భర్తీ చేస్తున్నారో నోటిఫికేషన్‌లో చెప్పలేదు. 

విద్యార్హతలు 

అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రధానంగా ఈ అర్హతలు ఉండాలి. 

ఆర్ట్స్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, లా, కామర్స్, ఎడ్యుకేషన్‌  సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు యూజీసీ నిర్వహించే నెట్‌ లేదా సీఎస్‌ఐఆర్‌ నెట్ ఉత్తీర్ణులవ్వాలి. లేదా సెట్‌, స్లెట్‌ అర్హత కలిగి ఉండాలి. యూజీసీ 2009/2016 నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి నెట్‌/సెట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్ లేదా ఎంజీ/ ఎంటెక్‌/ ఎంఎస్‌లలో ఏదో ఒకటి ఫస్ట్ క్లాస్‌ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

మేనేజ్మెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ, పీజీడీఎం, ఎంకామ్‌ లలో ఫస్ట్ క్లాస్, నెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీతోపాటు రెండేళ్ల వృత్తిపరమైన అనుభవం ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యూగులకు అర్హత మార్కుల్లో ఐదు శాతం సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

మొదట ఏపీపీఎస్సీ ద్వారా సీబీటీ స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. ఇందులో అభ్యర్థులను 1:12 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత అకాడమిక్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్ పబ్లికేషన్స్ ఆధారంగా 1:4 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. 

ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ఇందులో లెక్చర్‌ డెమోన్‌స్ట్రేషన్‌కు 25 మార్కులు, పర్శనాలిటీకి 15 మార్కులు, డొమైన్ నాలెడ్జ్‌కు 35మార్కులు, రీసెర్చ్ కాంపిటెన్స్‌కు 25 మార్కులు కేటాయిస్తారు. 

కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజీ ఉంటుంది. యూనివర్శిటీల్లో పని చేస్తున్న అర్హత గల కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి ప్రతి సర్వీస్ ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు వెయిటేజీ ఇస్తారు. 

https://apuniversitiesrecruitment.apcfss.in సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అందులో కామన్‌ రిక్రూట్‌మెట్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించిన తర్వాత రిజిస్ట్రేష్ ఫారమ్ ప్రింట్‌ అవుట్ తీసుకొని, అన్ని సంబంధిత పత్రాల హార్డ్ కాపీలను సెల్ఫ్‌  అసిస్టేషన్ చేసి  సంబంధిత యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి.