Tata Motors Announces Massive Discounts on Electric Vehicles : ఇండియన్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల (EV) శ్రేణిపై ఈ మే నెలలో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. టాటా కంపెనీకి చెందిన పాపులర్ ఈవీ మోడల్స్ అయిన నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ, హారియర్ ఈవీ ఇంకా కర్వ్ ఈవీ కార్లపై ఈ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్ల వివరాలు కార్ల మోడల్ ఇయర్, వేరియంట్లు ఇంకా స్థానిక డీలర్‌షిప్ దగ్గర ఉన్న స్టాక్‌ను బట్టి మారే అవకాశం ఉంది. కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఈ సమ్మర్ సీజన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
నెక్సాన్ ,ఫ్లాగ్‌షిప్ హారియర్ ఈవీపై ఆఫర్లు..
టాటా కంపెనీలో మోస్ట్ పాపులర్ అయిన నెక్సాన్ ఈవీ (Nexon EV) పాత 2024, 2025 మోడళ్లపై రూ. 1.2 లక్షల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ. 20,000 గ్రీన్ బోనస్, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ లేదా రూ. 55,000 స్క్రాపేజ్ బెనిఫిట్ తో పాటు రూ. 50,000 వరకు లాయల్టీ బోనస్ కలిసి ఉన్నాయి. అదే కొత్త 2026 నెక్సాన్ ఈవీ మోడల్‌పై మాత్రం గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఇక టాటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీ (Harrier EV) 2025, 2026 మోడళ్లపై రూ. 1.5 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో గ్రీన్ బోనస్ లేనప్పటికీ, రూ. 75,000 స్క్రాపేజ్ బెనిఫిట్ లేదా రూ. 50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. పాత ఈవీ కస్టమర్లకు రూ. 1 లక్ష లాయల్టీ బోనస్, ఐసీఈ (పెట్రోల్/డీజిల్) నుండి అప్‌గ్రేడ్ అయ్యేవారికి రూ. 50,000 ఇస్తున్నారు. అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఇంటర్వెన్షన్ బోనస్ కూడా వర్తిస్తుంది.
టియాగో ఈవీ ,పంచ్ ఈవీలపై భారీ తగ్గింపు..
టాటా బ్రాండ్ నుండి వస్తున్న మోస్ట్ అఫర్డబుల్ ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీ (Tiago EV) పై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. పాత 2024, 2025 మోడల్ లోని ఎల్ఆర్ ఎక్స్‌జెడ్ ప్లస్ (LR XZ+ Tech Lux తో కలిపి) వేరియంట్లపై రూ. 2.1 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎల్ఆర్ ఎక్స్‌టీ (LR XT) వేరియంట్లపై రూ. 1.8 లక్షలు, ఎమ్ఆర్ (MR) వేరియంట్లపై రూ. 1.5 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. కొత్త 2026 మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ. 60,000 నుండి రూ. 1.2 లక్షల వరకు తగ్గింపు ఉంటుంది. అలాగే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంచ్ ఈవీ (Punch EV) పాత లాంగ్ రేంజ్ వెర్షన్లపై రూ. 2.1 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. మిడ్ రేంజ్ వేరియంట్లపై రూ. 1.9 లక్షలు, స్మార్ట్ ట్రిమ్ పై రూ. 1.6 లక్షల వరకు తగ్గింపు ఉంది. కొత్త 2026 మోడల్ పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ పై రూ. 1.4 లక్షలు, మిడ్ రేంజ్ పై రూ. 1.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించారు.
కర్వ్ ఈవీపైనే అత్యధిక డిస్కౌంట్..
ఈ మే నెల డిస్కౌంట్ చార్ట్‌లో అందరికంటే టాప్‌లో నిలిచింది టాటా కర్వ్ ఈవీ (Curvv EV). ఈ సరికొత్త కూపే స్టైల్ ఎస్‌యూవీపై కస్టమర్లు ఏకంగా రూ. 3.8 లక్షల వరకు భారీ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. పాత 2024, 2025 మోడల్ లోని క్రియేటివ్ 45 (Creative 45) వేరియంట్‌పై రూ. 3.3 లక్షల వరకు తగ్గింపు ఉండగా, మిగిలిన హయ్యర్ వేరియంట్లపై గరిష్టంగా రూ. 3.8 లక్షల భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక కొత్త 2026 మోడల్ కర్వ్ ఈవీ విషయానికి వస్తే, వేరియంట్‌ను బట్టి కస్టమర్లు రూ. 3.3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను పొందవచ్చు. కారు మైంటెనెన్స్ టిప్స్ ఫాలో అవుతూ మంచి మైలేజ్ లేదా రేంజ్ పొందాలనుకునే వారికి, పర్యావరణహితమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి టాటా అందిస్తున్న ఈ ఆఫర్లు ఒక గోల్డెన్ అప్సరిట్యునిటీ అని చెప్పాలి. కారు కొనే ముందు మీ లోకల్ షోరూమ్‌లో స్టాక్ వివరాలు కనుక్కోవడం మంచిది.
