ఏపీపీఎస్సీ విడుదల చేసిన సహాయ మోటార్ వాహన ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) ఉద్యోగ నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతితెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 2న ప్రారంభమై నవంబరు 21న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.ఈ జాబ్ నోటిఫికేషన్‌లో ప్రశ్నాపత్రం ఇంగ్లీష్‌లోనే ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని తూర్పుగోదావరి జిల్లా వాసి కాశీ ప్రసన్నకుమార్ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రశ్నపత్రం ఇస్తామనడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.


వివరాలు..


* అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (రవాణా శాఖ)


ఖాళీల సంఖ్య:  17 పోస్టులు (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-15)


అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి:01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 150 మార్కులు, పేపర్-2 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.


దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డుదారులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


జీత భత్యాలు: నెలకు రూ.31,460-రూ.84,970.


ముఖ్యమైన తేదీలు...


ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.11.2022.


ఫీజు చెల్లింపు చివరి తేది: 21.11.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22.11.2022.


Notification


Website 


Also Read:


ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
నోయిడా ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీని ద్వారా డిప్యూటీ డైరెక్టర్, EDP అసిస్టెంట్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఇంటర్, సంబధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్‌లో స్పీడ్‌గా టైప్ చేయకలగాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 12 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈపీఐఎల్‌లో మేనేజర్‌ ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోండి!
ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్(ఈపీఐఎల్) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...